IPL 2023: ఫ్లైట్ జర్నీలో అభిమానితో కోహ్లి ఫైట్.. అసలేం జరిగిందో చెప్పిన స్టార్ ప్లేయర్
ఐపీఎల్-16తో విరాట్ కోహ్లీ బిజీ అయిపోయాడు. అయితే, మధ్య మధ్యలో ఆర్సీబీ పాడ్‌క్యాస్ట్‌తో తన వ్యక్తిగత విషయాలతోపాటు కెరీర్‌కు సంబంధించిన విషయాలను పంచుకుంటున్నాడు.
బెంగళూరు: ఐపీఎల్-16తో విరాట్ కోహ్లీ బిజీ అయిపోయాడు. అయితే, మధ్య మధ్యలో ఆర్సీబీ పాడ్‌క్యాస్ట్‌తో తన వ్యక్తిగత విషయాలతోపాటు కెరీర్‌కు సంబంధించిన విషయాలను పంచుకుంటున్నాడు. తాజాగా గతంలో కొచ్చి నుంచి ఢిల్లీకి వెళ్లేటప్పుడు ఫ్లైట్ జర్నీ సమయంలో ఓ అభిమాని చేసిన హంగామాను గుర్తు చేసుకున్నాడు. ‘ఫ్లైట్‌లో ఓ అభిమాని నేరుగా ధోనీ వద్దకు వెళ్లి కెప్టెన్సీ గురించి టిప్స్ ఇచ్చాడు. ప్లేయింగ్ ఎలెవన్‌పైనా సూచనలు చేశాడు. ధోనీ మాత్రం అతని మాటలను కామ్‌గా విన్నాడు.
ఆ తర్వాత నా దగ్గరికి వచ్చి నీ సంగతేంటి అని ప్రశ్నించాడు. ఏమైందని నేను అడిగితే.. అదే నీ బ్యాటింగ్ సంగతేంటి..? అని మళ్లీ ప్రశ్నించాడు. ఆ సమయంలో నేను కొన్ని మ్యాచ్‌ల్లో త్వరగానే అవుటయ్యా. దాని గురించే అతను నన్ను ప్రశ్నిస్తున్నాడని అనుకున్నా. కొన్ని మ్యాచ్‌లు సరిగ్గా ఆడలేదని అతనికి చెప్పా. అది నాకు తెలుసని.. వచ్చే మ్యాచ్‌లో సెంచరీ చేయాలని సూచించాడు.
ఇక, ఇలా అయితే కుదరదని అనుకుని అతనికి క్లాస్ పీకాలని భావించా. మీరు ఏం చేస్తారని అడిగా. ఏదో కంపెనీలో ఉన్నత స్థాయి ఉద్యోగం చేస్తున్నట్టు చెప్పాడు. మీరు మూడు నెలల్లో ఆ కంపెనీకి చైర్మన్ అయిపోవాలనుకుంటున్నా అని చెప్పా. అది ఎలా సాధ్యమని అతను ఆశ్చర్యపోయాడు. మరి మీరు నన్ను ఎలా అడుగుతారు..? అని ప్రశ్నించా. నేను వీడియో గేమ్ ఆడటం లేదు. ప్రతి మ్యాచ్‌లో నా బెస్ట్ ఇచ్చేందుకు కృషి చేస్తా.. కానీ, కొన్ని సార్లు త్వరగా అవుటవుతామని చెప్పగానే అతను సైలెంట్ అయ్యాడు. అప్పుడు మిగతా సభ్యులు కోచ్ కోచ్ అని అరవడంతో అతను కాసేపు నవ్వి అక్కడి నుంచి తన సీటు వద్దకు వెళ్లిపోయాడు’ అని కోహ్లీ వివరించాడు.