ముంబైను చిత్తుగా ఓడించిన గుజరాత్..
గుజరాత్ లోని అహ్మదాబాద్లో జరిగిన 35వ ఐపీఎల్ మ్యాచ్లో ముంబై జట్టుపై గుజరాత్ 55 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది.
దిశ, వెబ్డెస్క్: గుజరాత్లోని అహ్మదాబాద్లో జరిగిన 35వ ఐపీఎల్ మ్యాచ్లో ముంబై జట్టుపై గుజరాత్ 55 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్లో మొదట టాస్ గెలిచిన ముంబై జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో రాజస్థాన్ జట్టు బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో రాజస్థాన్ బ్యాటర్లు గిల్ 56, మిల్లర్ 46, మనోహర్ 42, తెవతియ 20, తో రాణించడంతో 6 వికెట్ల నష్టానికి గుజరాత్ జట్టు 207 పరుగులు చేసింది. దీంతో 208 పరుగుల భారీ లక్ష్యంతో చేజింగ్కు దిగిన ముంబై బ్యాటర్లు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు.. 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 152 పరుగులు మాత్రమే చేసిన ముంబై జట్టు ఘోర పరాజయాన్ని ముటగట్టుకుంది. ఈ మ్యాచ్ విజయంతో గుజరాత్ టైటాన్స్ 10 పాయింట్లతో టేబుల్ లో రెండో స్థానం చేరుకుంది.