RCB పై కోల్‌కతా విజయం..

ఐపీఎల్ 2023లో నిన్నటి మ్యాచ్‌తో లీగ్ స్టేజిలో సగం మ్యాచులు పూర్తయ్యాయి. బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో

Update: 2023-04-27 01:46 GMT
RCB పై కోల్‌కతా విజయం..
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2023లో నిన్నటి మ్యాచ్‌తో లీగ్ స్టేజిలో సగం మ్యాచులు పూర్తయ్యాయి. బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో KKR, RCB మధ్య జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా జట్టు 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. కాగా ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన RCB జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో KKR బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 200 పరుగులు చేసింది.

అనంతరం 201 పరుగుల భారీ లక్ష్యంతో చేజింగ్ కు దిగిన RCB‌కి ఆదిలోనే డుప్లేసిస్ అవుట్ కావడంతో గట్టిదెబ్బ తగిలింది. అనంతరం షాబాద్ ఆహ్మద్, మాక్స్‌వెల్ ఒకే ఓవర్ లో అవుట్ కావడంతో ఆర్సీబీ కష్టాల్లో పడింది. విరాట్ కోహ్లీ నిలకడగా ఆడుతు మ్యాచ్ ను చక్కబెట్టే ప్రయత్నం చేసినప్పటికీ అతని ప్రయత్నం ఫలించలేదు. దీంతో ఆర్సీబీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 179 పరుగులు చేయడంతో ఓటమి పాలైంది. ఈ ఓటమితో ఆర్సీబీ జట్టుకు వరుస విజయాలకు బ్రేక్ పడింది. అలాగే KKR కూ వరుస ఓటములకు బ్రేక్ వేసింది.

Tags:    

Similar News