NZ vs AFG: కివీస్‌కు షాకిచ్చిన ఆఫ్ఘనిస్తాన్.. టీ20 వరల్డ్‌కప్‌లో ఓడించడం ఇదే తొలిసారి!
టీ20 వరల్డ్‌కప్‌లో న్యూజిలాండ్ జట్టుకు ఆఫ్ఘనిస్తాన్ టీమ్ గట్టి షాక్ ఇచ్చింది. గ్రూప్-సీలో భాగంగా ఇవాళ జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై 84 రన్స్ తేడాతో విజయం సాధించింది.
దిశ, డైనమిక్ బ్యూరో: టీ20 వరల్డ్‌కప్‌లో న్యూజిలాండ్ జట్టుకు ఆఫ్ఘనిస్తాన్ టీమ్ గట్టి షాక్ ఇచ్చింది. గ్రూప్-సీలో భాగంగా ఇవాళ జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై 84 రన్స్ తేడాతో విజయం సాధించింది. తొలిసారిగా టీ20 క్రికెట్‌లో కివీస్‌ను ఆఫ్ఘాన్ ఓడించింది. కాగా, మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ బౌలింగ్‌ను ఎంచుకుంది. బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 159 స్కోర్ చేసింది.
ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన కివీస్ 15.2 ఓవర్లలో కేవలం 75 పరుగులకే ఆలౌట్ అయింది. ఆఫ్ఘనిస్తాన్ ఆల్‌రౌండ్ షోతో ఆకట్టుకున్నది. ఆఫ్ఘాన్ ప్లేయర్ గుర్బాజ్ 52 బంతుల్లో 80 రన్స్ చేసి అధ్భుతంగా రాణించారు. కాగా, ఈ టోర్నీలో ఆఫ్ఘనిస్తాన్‌కు ఇది వరుసగా రెండో విజయం. ఈ విజయంతో ఆఫ్ఘాన్ సూపర్-8కి చేరుకునే అవకాశం ఉంది.