దొంగతనం చేసి చెక్కేద్దామనుకొని చిక్కిపోయారు
దొంగతనాలు చేస్తూ వేర్వేరుగా పట్టుబడ్డ ఇద్దరు దొంగలకు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించిన సంఘటనలు మంగళవారం భి క్కనూరు మండలంలో చోటు చేసుకున్నాయి.
దిశ, భిక్కనూరు : దొంగతనాలు చేస్తూ వేర్వేరుగా పట్టుబడ్డ ఇద్దరు దొంగలకు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించిన సంఘటనలు మంగళవారం భి క్కనూరు మండలంలో చోటు చేసుకున్నాయి. వివరాల్లోకి వెళితే... భిక్కనూరు మండల కేంద్రంలోని సిద్ధ రామేశ్వర గంజ్ లో ఉన్న ఇస్తారాకుల గోపాల్ తన ఫ్యాక్టరీ ముందు వాహనాలను పార్క్ చేసి ఉంచుతాడు. ఈ క్రమంలో పాత నేరస్తుడైన ఒకరు వాహనాల టైర్లు ఎత్తుకెళ్తున్నాడు.
అనుమానం వచ్చి గోపాల్ సీసీ ఫుటేజ్ ను పరిశీలించగా స్థానికుడైన ఆ పాత నేరస్తుని గుర్తించి గుంజకు కట్టేసి కొట్టారు. అనంతరం స్థానిక పోలీసులకు అప్పగించారు. రాజంపేట మండలం తలమడ్ల గ్రామానికి చెందిన పాత నేరస్తుడు మండలంలోని జంగంపల్లి రేణుకాదేవి ఎల్లమ్మ ఆలయంలో రాత్రి తాళాలు పగలగొట్టి లోనికి ప్రవేశించాడు. హుండీని పగలగొట్టి అందులోని నగదును ఎత్తుకెళ్లాడు. సీసీ ఫుటేజీలో నిక్షిప్తమైన వివరాల ఆధారంగా దొంగను పట్టుకొని స్తంభానికి కట్టేసి కొట్టారు. దొంగతనానికి పాల్పడింది నిజమేనని ఒప్పుకోవడంతో గ్రామస్తులు స్థానిక భిక్కనూరు పోలీసులకు అప్పగించారు.