ఎమ్మిగనూరు లో కలవరం రేపుతున్న యువకుడి ఆత్మహత్య

ఎమ్మిగనూరు మండల పరిధిలోని కలుగొట్ల గ్రామానికి చెందిన మాల మునిస్వామి,ఈరమ్మ ల కుమారుడు మాల రాజు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

Update: 2024-02-28 07:27 GMT

దిశ, ప్రతినిధి: ఎమ్మిగనూరు మండల పరిధిలోని కలుగొట్ల గ్రామానికి చెందిన మాల మునిస్వామి,ఈరమ్మ ల కుమారుడు మాల రాజు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బెంగళూరులో జీవనం కొనసాగిస్తున్న రాజు మృత్యువాత పడడంతో రాజు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.అయితే ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ విషయం తెలుసుకున్న జై భీమ్ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు రంగయ్య బెంగుళూరుకు వెళ్లి జరిగిన సంఘటన ను పరిశీలించి అక్కడి పోలీసు సిబ్బంది తో మాట్లాడి మృతదేహం స్వగ్రామానికి తీసుకొచ్చారు.అనంతరం ఆయన మాట్లాడుతూ యువత క్షణికావేశానికి లోనై తల్లిదండ్రులకు శోఖం మిగల్చవద్దని కష్టం లేనిదే జీవితం ముందుకు సాగడం లేదని తెలుసుకోవాలన్నారు. అనంతరం తల్లిదండ్రులకు రాజోలు ప్ప చేతుల మీదుగా ఆర్థిక సహాయం అందించి కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు. కాగా ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియలేదు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మల్లేష్,నల్లన్న,రాజు,బెళగల్ రంగన్న,దుర్గా తదితరులు పాల్గొన్నారు.


Similar News