భార్యను హత్య చేసి.. నరికిన తలతో పోలీస్ స్టేషన్లోకి వెళ్లిన వ్యక్తి
భార్యను హత్య చేసిన ఓ వ్యక్తి శరీరం నుంచి కట్ చేసిన తలతో పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. ఈ భయానక సంఘటన ఒడిశాలోని నయాగఢ్ జిల్లాలో చోటు చేసుకుంది.
దిశ, వెబ్డెస్క్: భార్యను హత్య చేసిన ఓ వ్యక్తి శరీరం నుంచి కట్ చేసిన తలతో పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. ఈ భయానక సంఘటన ఒడిశాలోని నయాగఢ్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నయాగఢ్ జిల్లాలోని అర్జున్ బాఘా, ధరిత్రి భార్యభర్తలు. కాగా బాధితురాలైన భార్య ధరిత్రి(30) మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందని అనుమానం కలిగింది. దీంతో నిందితుడు అర్జున్ అవేశం తో తన భార్యను దారుణంగా హత్య చేశాడు. అనంతరం భార్య తలను నరికి పోలీస్ స్టేషన్ కు పట్టుకెళ్లి.. తన భార్యను హత్య చేశానని తల చూపించాడు. దీంతో పోలీస్ స్టేషన్ లో ఉన్న వారంతా ఇక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అనంతరం కేసు నమోదు చేసుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.