symptoms of amoeba : అమీబా లక్షణాలతో సింగరేణి కార్మికుడు మృతి...

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో ఓ కార్మికుడు మృతి పట్టణంలో కలకలం రేపుతుంది. హనుమన్ బస్తీకి చెందిన వేముల శ్రావణ్ కుమార్ (30 ) సింగరేణి కార్మికుడు ఇవాళ అమీబా లక్షణాలతో మృతి చెందినట్లు వైద్యులు ప్రాథమికంగా స్పష్టం చేశారు.

Update: 2024-08-11 16:38 GMT

దిశ,బెల్లంపల్లి: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో ఓ కార్మికుడు మృతి పట్టణంలో కలకలం రేపుతుంది. హనుమన్ బస్తీకి చెందిన వేముల శ్రావణ్ కుమార్ (30 ) సింగరేణి కార్మికుడు ఇవాళ అమీబా లక్షణాలతో మృతి చెందినట్లు వైద్యులు ప్రాథమికంగా స్పష్టం చేశారు. శ్రావణ్ కుమార్ మొదట తీవ్రమైన జ్వరంతో అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే అతని కుటుంబ సభ్యులు గోదావరిఖని సింగరేణి ఏరియా ఆసుపత్రిలో చేర్పించారు.

పరిస్థితి అత్యంత విషమంగా మారడంతో హైదరాబాదులోని మల్లారెడ్డి ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతున్న శ్రావణ్ కుమార్ ఆసుపత్రిలోనే తుది శ్వాస విడిచారు. కాగా శ్రవణ్ కుమార్ అమీబా లక్షణాలతోనే మృతి చెందినట్లు అధికారికంగా నిర్ధారణ కానప్పటికీ వైద్యులు మాత్రం అమీబా లక్షణాలతోటే చనిపోయినట్లు వైద్యులు చెప్పినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. శ్రావణ్ కుమార్ రామగుండం ఏరియాలోని వకీల్ పల్లి 9 గనిలోపని చేస్తున్నాడు.


Similar News