పోర్న్ వీడియోల ఎఫెక్ట్.. సొంత చెల్లిపై అన్న దారుణం

సమాజంలో రోజురోజుకూ మానవత్వం మంటగలిసిపోతోంది. వావివరసలు మరిచి కొందరు దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు.

Update: 2024-07-27 11:07 GMT

దిశ, వెబ్‌డెస్క్: సమాజంలో రోజురోజుకూ మానవత్వం మంటగలిసిపోతోంది. వావివరసలు మరిచి కొందరు దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు. నెలలు నిండిన చిన్నారి నుంచి పండు ముసలి వరకు అందరిపైనా దారుణాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. పోర్న్ వీడియోలు చూడటం అలవాటు చేసుకున్న 13 ఏళ్ల బాలుడు ఏకంగా సొంత చెల్లిపైనే అత్యాచారం చేశాడు. ఈ ఘటన రాష్ట్రంలోని రేవా నగరంలో చోటుచేసుకుంది. అత్యాచారం చేసి ఆపై చెల్లి గొంతు నులిచి చంపేశాడు. ఇంటికొచ్చి కూతురుని చూసి కన్నీరుమున్నీరుగా విలపించిన కుటుంబసభ్యులు.. ఏం జరిగిందని బాలుడ్ని నిలదీశాడు. జరిగింది తెలుసుకొని చేసేదేం లేక చనిపోయిన బాలిక మృతదేహాన్ని ఇంటిబయట పడేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కుటుంబంపై అనుమానం వచ్చి విచారించగా అసలు విషయం బయటపడింది. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.


Similar News