jail : చోరీ కేసులో వ్యక్తికి ఏడాదిన్నర జైలు
దొంగతనం కేసులో ఓ వ్యక్తికి ఏడాదిన్నర కఠిన కారాగార జైలు శిక్షతో పాటు రెండు వందల రూపాయల జరిమానా విధిస్తూ సిరిసిల్ల ప్రథమశ్రేణి న్యాయమూర్తి ప్రవీణ్ కుమార్ బుధవారం తీర్పు వెల్లడించినట్లు సిరిసిల్ల డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు.
దిశ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి : దొంగతనం కేసులో ఓ వ్యక్తికి ఏడాదిన్నర కఠిన కారాగార జైలు శిక్షతో పాటు రెండు వందల రూపాయల జరిమానా విధిస్తూ సిరిసిల్ల ప్రథమశ్రేణి న్యాయమూర్తి ప్రవీణ్ కుమార్ బుధవారం తీర్పు వెల్లడించినట్లు సిరిసిల్ల డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. సిరిసిల్ల కార్గిల్ చెరువు సమీపంలోని కట్ట మైసమ్మ గుడిలో పనిచేసే శ్రీనివాస్ 2024 ఫిబ్రవరి 28న ఉదయం గుడి వద్దకు వచ్చి చూడగా గుడి తాళం పాగులగొట్టి, అందులో సుమారు 7000 రూపాయలు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు మేరకు కేసు
నమోదు చేసిన పోలీసులు గుడిలో దొంగతనానికి పాల్పడ్డ సిరిసిల్ల పట్టణం విద్యానగర్ కు చెందిన కొడం లక్ష్మణ్ అనే వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్ కి తరలించారు. విచారణ అనంతరం విచారణ అధికారి పి.శ్రీనివాస్ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయగా సీఎంఎస్ ఎస్ఐ రవీందర్ నాయుడు ఆధ్వర్యంలో కోర్టు కానిస్టేబుల్ వేముల నరేష్ సాక్షాలను ప్రవేశపెట్టగా, పబ్లిక్ ప్రాసిక్యూటర్ చెలుముల సందీప్ వాదించగా నేరస్తుడు కోర్టులో నేరం అంగీకరించాడు. కేసు పూర్వపరాలు పరిశీలించిన న్యాయమూర్తి ప్రవీణ్ నేరస్తుడైన కోడం లక్ష్మణ్ కు 18 నెలల కఠిన కారాగార జైలు శిక్షతో పాటు రెండు వందల రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పినట్లు డీఎస్పీ పేర్కొన్నారు.