బాలిక పట్ల అసభ్య ప్రవర్తన...ఐదేళ్లు జైలు

ఫోక్సో కేసులో ఓ మైనర్ బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన నిందితుడికి 5 సంవత్సరాల జైలుశిక్ష, 12 వేల రూపాయల జరిమానా విధిస్తూ అసిఫాబాద్ జిల్లా సెషన్ కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి ఎంవీ రమేష్ మంగళవారం తీర్పు ఇచ్చారు.

Update: 2024-09-17 13:26 GMT

దిశ,చింతలమానేపల్లి : ఫోక్సో కేసులో ఓ మైనర్ బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన నిందితుడికి 5 సంవత్సరాల జైలుశిక్ష, 12 వేల రూపాయల జరిమానా విధిస్తూ అసిఫాబాద్ జిల్లా సెషన్ కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి ఎంవీ. రమేష్ మంగళవారం తీర్పు ఇచ్చారు. చింతలమానేపల్లి ఎస్సై నరేష్ తెలిపిన వివరాల ప్రకారం కొమరంభీం అసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలంలోని దిందా గ్రామానికి చెందిన ఓ మైనర్ బాలికపై అదే గ్రామానికి చెందిన దుర్వ భాస్కర్ అనే నిందితుడు 2020లో బాలికతో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ అశ్లీల దృష్యాలను చూపించడంతో బాలిక భయపడి తల్లిదండ్రులకు తెలియజేసింది.

    దాంతో బాలిక తల్లి ఫిర్యాదు మేరకు చింతలమానేపల్లి పోలీస్ స్టేషన్ లో భాస్కర్ పైన ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి కోర్ట్ లో హాజరుపరచగా నేరం చేసినట్టు రుజువు కావడంతో నిందితుడికి 5 సంవత్సరాల జైలు శిక్షతో పాటు 12 వేల రూపాయలు జరిమానా విధిస్తూ జిల్లా జడ్జి తీర్పు ఇచ్చాడు. నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన ప్రస్తుత కాగజ్నగర్ డీఎస్పీ రామానుజం, కౌటాల సీఐ ఎం. రమేష్, ఎస్సై నరేష్,  కాగజ్ నగర్  డివిజన్ కోర్ట్ లైజనింగ్ ఆఫీసర్ బాబాజీ , కోర్టు సిబ్బందిని జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు అభినందించారు. 

Tags:    

Similar News