అర్ధరాత్రి భారీగా గుట్కా పట్టివేత

నిజామాబాద్ నగరంలో బుధవారం అర్ధరాత్రి పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా పెద్ద మొత్తంలో గుట్కాలు పట్టుకున్నారు.

Update: 2024-08-29 10:40 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ నగరంలో బుధవారం అర్ధరాత్రి పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా పెద్ద మొత్తంలో గుట్కాలు పట్టుకున్నారు. ఆర్ఆర్ చౌరస్తాలో పోలీసులు వాహనాల తనిఖీలు చేస్తుండగా ఓ కారుపై అనుమానం వచ్చి ఆపారు. కారును చెక్ చేస్తుండగా కారులో తరలిస్తున్న గుట్కా బస్తాలను పోలీసులు గుర్తించారు. ఈ కేసులో మహారాష్ట్రలోని నాందేడ్ కు చెందిన నిందితులు అంకుష్ జదల్వార్, శివాజీ గైక్వాడ్ లను అరెస్ట్ చేసి వారి నుండి రూ.1.24 లక్షల విలువైన గుట్కాను స్వాధీనం చేసుకున్నారు.

     నిజామాబాద్ కు చెందిన సుల్తాన్ అనే వ్యక్తి వద్ద తాను గుట్కాను కొనుగోలు చేసి నాందేడ్ జిల్లాకు తరలిస్తున్నట్లు నిందితులు పోలీసు విచారణలో తెలిపారు. టూ టౌన్ ఎస్ఐ యాసిర్ అరాఫత్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిషేధిత గుట్కా జిల్లాలో జోరుగా సాగుతుందని గత కొద్దిరోజులుగా పోలీసులకు, టాస్క్ ఫోర్స్ అధికారులకు సమాచారం ఉన్నట్లు తెలుస్తోంది. గుట్కా అమ్మకాలు, రవాణా పై ఈ మధ్యకాలంలో పోలీసులు ఫోకస్ పెట్టినట్లు సమాచారం.

Tags:    

Similar News