Arrest : జల్సాలకు అలవాటు పడి మొబైల్ స్నాచింగ్
జల్సాలకు అలవాటు పడి మొబైల్ స్నాచింగ్ చేస్తున్న ఇద్దరు యువకులను అరెస్ట్ చేసిన ఘటన జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
దిశ, జూబ్లిహిల్స్ : జల్సాలకు అలవాటు పడి మొబైల్ స్నాచింగ్ చేస్తున్న ఇద్దరు యువకులను అరెస్ట్ చేసిన ఘటన జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. జూబ్లిహిల్స్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... బేగంపేట కు చెందిన కుర్ర కిరణ్ కుమార్ (19) చదువుకుంటుంటాడు. జల్సాలకు అలవాటు పడి మొబైల్ స్నాచింగ్ చేస్తుంటాడు. అదే ప్రాంతానికి చెందిన మానిపాటి నితిన్ (17) ని కుర్ర కిరణ్ కుమార్ జల్సాలకు సులభంగా డబ్బు కావాలంటే స్నాచింగ్ చేద్దాం అని చెప్పి ఇద్దరూ కలిసి తమ కేటీఎం బైక్ నెంబర్ ప్లేట్ కి స్టిక్కర్
అతికించి జూబ్లిహిల్స్ లో రాత్రిపూట రెక్కీ చేసి తిరుగుతూ ఉండేవారు. జూలై 24 రాత్రి 8 గంటల ప్రాంతంలో జూబ్లిహిల్స్ పిల్లర్ నెం.1622 మెట్రో స్టేషన్ సమీపంలో రాధాకృష్ణ అనే వ్యక్తి ఫోన్ మాట్లాడుతూ నడుస్తుండగా అతని ఫోన్ ని ఈ స్నాచర్స్ కిరణ్ కుమార్ , నితిన్ లాక్కుని వెళ్లిపోయారు. కొంత సేపటికి బాధితుడు జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చెయ్యగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టి, వివిధ సీసీ కామెరాలు , ఆర్టీఓ కార్యాలయాల్లో బైక్ వివరాలు సేకరించి చివరికి నిండుతులిద్దర్ని పట్టుకుని , అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించినట్లు క్రైమ్ ఎస్ఐ వి.రాజశేఖర్ తెలిపారు.