Ganja gang : గంజాయి ముఠా అరెస్ట్
ఎక్సైజ్ శాఖ అధికారుల దాడుల్లో గంజాయి ముఠాను పట్టుకొని ఐదు కిలోల పైనే గంజాయి స్వాధీనం చేసుకుని ముఠాను అరెస్టు చేసిన ఘటన దూల్పేట్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
దిశ,కార్వాన్ : ఎక్సైజ్ శాఖ అధికారుల దాడుల్లో గంజాయి ముఠాను పట్టుకొని ఐదు కిలోల పైనే గంజాయి స్వాధీనం చేసుకుని ముఠాను అరెస్టు చేసిన ఘటన దూల్పేట్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. రాష్ట్ర ఎక్సైజ్ సూపరింటెండెంట్ అంజిరెడ్డి, దూల్పేట్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ మధుబాబు సంయుక్తంగా వివరాలను వెల్లడించారు. శనివారం దూల్పేట్ పురానాపూల్ జియాగూడ రహదారిలో ఎక్సైజ్ శాఖ రాష్ట్ర టాస్క్ ఫోర్స్ టీం, దూల్పేట్ పోలీస్ స్టేషన్ సిబ్బంది సంయుక్తంగా దాడులు నిర్వహించగా కుమ్మరి వాడి ప్రాంతానికి చెందిన నిఖిల్ కుమార్, అరుణ్ కుమార్, అనికేస్ సింగ్ ముగ్గురి వద్ద రెండు కిలోల 550 గ్రాముల
గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వీరి సమాచారం మేరకు కుమ్మరి వాడికి చెందిన అమ్రేష్, ఆశిష్, గణేష్, సాయికుమార్ వద్ద రెండు కిలోల 518 గ్రాముల గంజాయిని పట్టుకున్నారు. వీరికి గంజాయి సరఫరా చేసే సుధా మండల్, స్వపన్ మండల్, ఆర్తి బాయ్, ఆకాష్, అను సింగ్ లు పరారీలో ఉన్నట్లు వారు తెలిపారు. ఈ కేసులో ఏడుగురిని రిమాండ్ కు తరలించినట్లు ఎక్సైజ్ పోలీసులు తెలిపారు. కాగా గంజాయితో పాటు 8 ఫోన్లు, నాలుగు బైకులను స్వాధీనం చేసుకున్నట్లు వారు తెలిపారు. ఈ దాడులలో ఇన్స్పెక్టర్ గోపాల్, ఎస్సై భాస్కర్ రెడ్డి తోపాటు సిబ్బందిని ఎక్సైజ్ ఇన్ఫోర్స్మెంట్ ఆఫ్ డైరెక్టర్ కమలహాసన్ రెడ్డి, జాయింట్ కమిషనర్ ఎస్ వై. ఖురేషి, అసిస్టెంట్ కమిషనర్ ప్రణవి అభినందించారు.