మాజీ ఉద్యమ నేత అనుమానాస్పద మృతి?

మంగళగిరి టిప్పర్ల బజార్ లో నివాసం ఉంటున్న సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ మాజీ జిల్లా కార్యదర్శి నాదెండ్ల బ్రహ్మయ్య (50) మృతదేహం గుంటూరు రూరల్ పరిధిలోని జొన్నలగడ్డ గ్రామ సమీపంలో ఓ కాలువలో అనుమానస్పద స్థితిలో లభ్యమైంది.

Update: 2024-03-08 14:02 GMT

దిశ, మంగళగిరి: మంగళగిరి టిప్పర్ల బజార్ లో నివాసం ఉంటున్న సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ మాజీ జిల్లా కార్యదర్శి నాదెండ్ల బ్రహ్మయ్య (50) మృతదేహం గుంటూరు రూరల్ పరిధిలోని జొన్నలగడ్డ గ్రామ సమీపంలో ఓ కాలువలో అనుమానస్పద స్థితిలో లభ్యమైంది. సమాచారం అందుకున్న నల్లపాడు పోలీసులు భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రకాశం జిల్లా కారుమంచి గ్రామానికి చెందిన నాదెండ్ల బ్రహ్మయ్య గుంటూరు నగరంలో విద్యను అభ్యసిస్తూ PDSO యువజన విభాగం లో పనిచేశారు.

సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ గుంటూరు జిల్లా కార్యదర్శిగా 20 సంవత్సరాలు పని చేశారు. రెండేళ్ల క్రితం పార్టీ అధిష్టానం నాదెండ్ల బ్రహ్మయ్య నిధులు దుర్వినియోగం, పోలీస్ ఇన్ ఫార్మర్ నెపంతో పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. దుర్వినియోగం చేసిన పార్టీ నిధులను చెల్లించాలని పార్టీ నాదెండ్ల పై ఒత్తిడి పెంచింది. దీనిలో భాగంగా బయటకు వెళ్లిన నాదెండ్ల బ్రహ్మయ్య గురువారం రాత్రి ఇంటికి రాలేదు. ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. శుక్రవారం ఉదయం నల్లపాడు పోలీసులు బ్రహ్మం భార్యకు సమాచారం ఇచ్చారు. బ్రహ్మం అత్త గ్రామమైన మంగళగిరి మండలం ఎర్రబాలెం లో పోస్టుమార్టం అనంతరం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబీకులు తెలిపారు.


Similar News