కెనాల్‌లో దూకి ఆత్మహత్య చేసుకున్న కుటుంబం.. ఎంత కష్టం వచ్చిందో తెలుసా?

లోన్‌ యాప్ ఏజెంట్ల వేధింపులకు మరో కుటుంబం బలైంది. ఈ ఘటన కర్ణాటకలోని హాసన్‌లో చోటుచేసుకుంది.

Update: 2024-08-15 16:44 GMT

దిశ, వెబ్‌డెస్క్: లోన్‌ యాప్ ఏజెంట్ల వేధింపులకు మరో కుటుంబం బలైంది. ఈ ఘటన కర్ణాటకలోని హాసన్‌లో చోటుచేసుకుంది. శ్రీనివాస్ అనే వ్యక్తి హాసన్‌లో క్యాబ్ డ్రైవర్. అతని భార్య శ్వేత ప్రయివేట్ టీచర్. ఆర్థిక పరిస్థితులు బాగోలేక ఇటీవల శ్రీనివాస్ ఆన్‌లైన్‌లో లోన్ తీసుకున్నాడు. తీసుకున్న లోన్ చెల్లించడం లేదని ఏజెంట్లు వేధింపులు మొదలెట్టారు. కుటుంబం మొత్తాన్ని రోడ్డుకీడ్చడంతో పరువు పోయిందని భావించిన శ్రీనివాస్.. భార్య శ్వేత, కూతరు నాగశ్రీ(13) తో కలిసి కాలువలో దూకారు. దీంతో భయాందోళన చెందిన శ్రీనివాస్ తల్లిదండ్రులు మిస్సింగ్ కేసు పెట్టారు. పోలీసుల దర్యాప్తులో వీరు సూసైడ్ చేసుకున్నారని నిర్ధారణ అయింది. దీనికి కారణం లోన్ యాపేనని పోలీసులు గుర్తించారు. తల్లిదండ్రులు ఫిర్యాదు ఇచ్చిన వారం రోజుల తర్వాత వారి మృతదేహాలు లభ్యమయ్యాయి. ప్రస్తుతం పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News