చాక్ పౌడర్, గంజితో నకిలీ మాత్రలు తయారీ.. పక్కా సమాచారంతో పోలీసుల ఎంట్రీ!

రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో నకిలీ మందులు తయారు చేస్తున్న బృందాన్ని పోలీసులు పట్టుకున్నారు. చాక్ పౌడర్, గంజితో మెడిసిన్స్ తయారు చేస్తున్న కేటుగాళ్ల గుట్టురట్టయింది.

Update: 2024-03-05 10:23 GMT

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో నకిలీ మందులు తయారు చేస్తున్న బృందాన్ని పోలీసులు పట్టుకున్నారు. చాక్ పౌడర్, గంజితో మెడిసిన్స్ తయారు చేస్తున్న కేటుగాళ్ల గుట్టురట్టయింది. పక్కా సమాచారంతో మంగళవారం పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా మెగ్‌లైఫ్ సైన్సెస్ కంపెనీ పేరుతో మందుల విక్రయాలు జరుపుతున్నట్లు గుర్తించారు. మొత్తం రూ.33 లక్షల విలువైన మందులను సీజ్ చేశారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.

ఈ సందర్భంగా తెలంగాణ డ్రగ్స్‌ కంట్రోల్‌ అధికారులు మాట్లాడుతూ.. ఫేక్ ప్రకనటలు చూసి మోసపోవద్దని సూచించారు. టీవీల్లో, సెల్‌ఫోన్లలో ప్రకటనలు చూసి ఈ మధ్య టాబ్లెట్స్ కొనుగోలు చేయడం కామన్ అయిపోయిందని గుర్తుచేశారు. వీటిలో చాలా పెద్ద మోసం దాగుందని అనుమానం వ్యక్తం చేశారు. గుర్తింపు పొందిన మెడికల్ షాపుల్లోనే మాత్రలు కొనుగోలు చేయాలని సూచించారు. నకిలీ మెడిసిన్ పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.

Tags:    

Similar News