BREAKING: రాజేంద్రనగర్‌లో పోలీసుల తనిఖీలు.. రూ.20 లక్షల విలువైన డ్రగ్స్ స్వాధీనం
రాష్ట్రంలో డ్రగ్స్ మాఫియాను సమూలంగా నిర్మూలించేందుకు సర్కార్ ఫుల్ ఫోకస్ పెట్టింది.
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో డ్రగ్స్ మాఫియాను సమూలంగా నిర్మూలించేందుకు సర్కార్ ఫుల్ ఫోకస్ పెట్టింది. ఈ మేరకు మాదక ద్రవ్యాలతో రెడ్ హ్యాండెడ్‌గా ఎవరు పట్టుబడినా.. వారిని కఠినంగా శిక్షించాలంటూ పోలీసు శాఖకు ఆదేశాలను జారీ చేసింది. ఈ మేరకు టాస్క్‌ఫోర్స్, ఇతర పోలీసు సిబ్బంది రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. బస్టాండ్, రైల్వే స్టేషన్లు, పట్టణాల్లోని ప్రధాన కూడళ్లలో వాహనాలను ఆపి క్షుణ్ణంగా తనిఖీ చేపడుతూ.. గంజాయి, డ్రగ్స్ అక్రమ రవాణాను అడ్డుకుని కేసులు బుక్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇవాళ హైదరాబాద్ పరిధిలోని రాజేంద్రనగర్ సన్ సిటీ వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా.. ఓ మహిళ, యువకుడు అక్రమంగా తరలిస్తున్న 270 గ్రాముల ఎండీఎంను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన సరుకు విలువ రూ.20 లక్షల వరకు ఉంటుందని పోలీసులు వెల్లడించారు. ఈ మేరకు నిందితులు ఇద్దరిని అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు.