road accident : కారు ఢీకొని వృద్ధుడు మృతి

కారు ఢీకొని వృద్ధుడు మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని కమ్మర్లపల్లి గ్రామంలో శనివారం రాత్రి చోటుచేసుకుంది.

Update: 2024-07-21 12:54 GMT

దిశ, చిన్నకోడూరు : కారు ఢీకొని వృద్ధుడు మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని కమ్మర్లపల్లి గ్రామంలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. ఎస్సై బాలకృష్ణ స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన బద్దిపడిగా రాజయ్య (60) తన ఇంటి నుండి గ్రామంలోకి నడుచుకుంటూ వెళుతున్న తరుణంలో సిద్దిపేట నుండి బెజ్జంకి మండలం గుండారం

     గ్రామానికి వెళ్తున్న కారు వెనుక నుండి ఢీకొనడంతో వృద్ధుడికి తీవ్ర గాయాలయ్యాయి. వృద్ధున్ని సిద్దిపేట జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. మృతునికి భార్య ఎల్లవ్వ, కొడుకు శేఖర్ లు ఉన్నారు. కొడుకు శేఖర్ ఫిర్యాదు మేరకు ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. 

Tags:    

Similar News