వ్యసనాలకు బానిసై దారి దోపిడీలు

వ్యసనాలకు బానిసై దారీ దోపిడీ, దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురి ముఠాను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించిన ఘటన గుడిమల్కాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.

Update: 2024-08-11 15:11 GMT

దిశ,కార్వాన్ : వ్యసనాలకు బానిసై దారీ దోపిడీ, దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురి ముఠాను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించిన ఘటన గుడిమల్కాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఏసీపీ మునావర్ అలి, ఇన్స్పెక్టర్ భైరి రాజు తెలిపిన వివరాల ప్రకారం.. చిన్న నాటి స్నేహితులైన సుభాష్ నగర్, తిరుమలగిరికి చెందిన సీహెచ్.పవన్ కొరియర్ డెలివరీ బాయ్. సికింద్రాబాద్ వారాసి గూడకి చెందిన దాస్ వంశీ కృష్ణ ఆఫీస్ బాయ్. తిరుమలగిరికి చెందిన స్టీవెన్ బైక్ మెకానిక్. బగ్డి సుజల్ స్విగ్గి డెలివరీ బాయ్. వీరంతా వ్యసనాలకు బానిసై దారి దోపిడీ దొంగతనాలకు పాల్పడి వచ్చిన వాటితో జల్సాలు చేసేవారు. వీరిలో ఇద్దరు కలిసి గంజాయి కొనుగొలు చేసేందుకు గత నెల 28న దూల్ పేట్ లోని మంగళ్ హాట్ కు బస్సులో వచ్చారు. వీలైతే దారి మధ్యలో దొంగతనం చేయాలని ప్లాన్ వేసుకున్నారు. గంజాయి కొనుగోలు చేసిన అనంతరం

     రేతి బౌలి లోని పిల్లర్ నంబర్ 35 వద్ద ఓ ఆటో ను ఆపి సికింద్రబాద్ రైల్వే స్టేషనుకు 400 రూపాయిలకు బేరం కుదుర్చుకుని బయలుదేరారు. రాణిగంజ్ కి చేరుకోగానే ఆటోని ఆపారు. పథకం ప్రకారం మరొకరు బైక్ పై అక్కడికి చేరుకోగా, మరొకడు కారులో వచ్చాడు. ఈ క్రమంలో ఆటో డ్రైవర్ ను బలవంతంగా కారులో ఎక్కించుకుని తిరుమలగిరి లోని ఓ నిర్మానుష్య ప్రదేశంలోకి తీసుకువెళ్లి కత్తితో బెదిరించి అతని వద్ద ఉన్న 7800 రూపాయలతో పాటు అతని మెడలోని వెండి గొలుసు, చేతికి ఉన్న వెండి ఉంగరాలను బలవంతంగా లాక్కొని ఫోన్ పే ద్వారా 1000 రూపాయలను ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని సీసీ పుటేజ్ ఆధారంగా నలుగురిని అదుపులోకి తీసుకొని ద్విచక్రవాహనం తో పాటు 2 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకొని రిమాండ్కు తరలించారు. కాగా వీరిపై గతంలో పలు పోలీస్ స్టేషన్లలో కేసులు ఉన్నట్లు ఏసీపీ తెలిపారు.   

Tags:    

Similar News