suicide : గల్ఫ్ లో కామారెడ్డి జిల్లా వాసి ఆత్మహత్య

అప్పులు తీర్చడానికి గల్ఫ్ వెళ్లిన కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం బంజెపల్లి వాసి ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది.

Update: 2024-07-30 14:29 GMT

దిశ, మాచారెడ్డి: అప్పులు తీర్చడానికి గల్ఫ్ వెళ్లిన కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం బంజెపల్లి వాసి ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. ఆర్థికంగా కుంగిపోయిన యువత నిలదొక్కుకోవడానికి గల్ఫ్ వెళుతారు. లక్షలు అప్పు చేసి గల్ఫ్ వెళ్లిన తర్వాత అక్కడ పరిస్థితులు ప్రతికూలంగా మారడంతో చేసిన అప్పులను తీర్చలేక, అక్కడ బ్రతకలేక ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. వారి కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయి. మాచారెడ్డి మండలం బంజేపల్లి గ్రామ వాసి గుగులోత్ నరేష్ తీవ్ర ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా దుబాయ్ కి వలస వెళ్లాడు. అక్కడ వేతనాలు ఇవ్వకపోవడంతో అప్పులు తీర్చే మార్గం లేక మనస్థాపానికి గురై పనిచేసే చోట ఫ్యాన్ కి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. గుండెలవిసేలా రోదిస్తున్న మృతుని కుటుంబ సభ్యులను ఓదార్చడానికి కన్నీళ్లు ఆగడంలేదని గ్రామస్తులు విషాదం వెలిబుచ్చారు.


Similar News