కొడుకును కడతేర్చిన కసాయి తండ్రి!

కన్న కొడుకును కత్తితో చంపిన సంఘటన గాంధారి మండల కేంద్రంలో కలకలం రేపుతుంది.

Update: 2023-12-21 05:06 GMT

దిశ గాంధారి: కన్న కొడుకును కత్తితో చంపిన సంఘటన గాంధారి మండల కేంద్రంలో కలకలం రేపుతుంది. వివరాల్లోకి వెళితే గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలోని పెద్ద గుజ్జుల్ గ్రామానికి చెందిన ఓ తండ్రి కొడుకును బుధవారం రాత్రి కత్తితో క్షణికావేశంలో పొడిచి  చంపాడు. అనంతర తండ్రి కూడా తన ఇంటి వద్ద ఉన్న పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దీంతో చికిత్స కోసం ఆసుపత్రి తరలిస్తుండగా.. మార్గమధ్యంలో తండ్రి కూడా మరణించాడు. 


Similar News