రామమందిర ప్రారంభోత్సవం బీజేపీ వ్యక్తిగత కార్యక్రమం: ఎస్పీ నేత స్వామి ప్రసాద్ మౌర్య

రామమందిరం బీజేపీ వ్యక్తిగత కార్యక్రమం అని సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) నేత స్వామి ప్రసాద్ మౌర్య అన్నారు.

Update: 2024-01-10 08:27 GMT

దిశ, నేషనల్ బ్యూరో: రామమందిర ప్రారంభోత్సవం బీజేపీ వ్యక్తిగత కార్యక్రమం అని సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) నేత స్వామి ప్రసాద్ మౌర్య అన్నారు. అందుకే విగ్రహ ప్రాణ ప్రతిష్టకు హాజరయ్యే అతిథుల జాబితాను ఆ పార్టీ తయారుచేస్తుందని విమర్శించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ వేడుకకు మీరు హాజరవుతారా అని విలేకరులు ప్రశ్నించగా..ఇది బీజేపీ ప్రయివేటు ప్రోగ్రామ్ కాబట్టి నాకు ఆహ్వానం ఎలా అందుతుంది అని బదులిచ్చారు. వాస్తవానికి, రామ్ లల్లా విగ్రహం ఉన్న స్థలం ఆలయానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉందని చెప్పారు. ‘1955లో సుప్రీంకోర్టు హిందూయిజం అనేది మతం కాదని, ఒక జీవన విధానం అని పేర్కొంది. ఇది 200 కంటే ఎక్కువ మతాల సమూహం’ అని చెప్పారు. కాగా, గతేడాది డిసెంబర్‌లో హిందూ మతంపై స్వామి ప్రసాద్ చేసిన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఇది రాజకీయంగా పలు విమర్శలకు దారి తీసింది. 

Tags:    

Similar News