అయోధ్య ఈవెంట్: హిందూ ఎంప్లాయీస్‌కు మారిషస్ ప్రభుత్వం గుడ్ న్యూస్

హిందూ ప్రభుత్వాధికారులకు మారిషస్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.

Update: 2024-01-13 06:20 GMT

దిశ, నేషనల్ బ్యూరో: హిందూ ప్రభుత్వాధికారులకు మారిషస్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య రామాలయంలో విగ్రహ ప్రాణప్రతిష్ట జరిగే ఈ నెల 22వ తేదీన హిందూ ప్రభుత్వ అధికారులకు రెండు గంటల సెలవును మంజూరు చేసింది. ఈ మేరకు ప్రధాన మంత్రి ప్రవింద్ కుమార్ జుగ్‌నాథ్ నేతృత్వంలోని మారిషస్ క్యాబినెట్ ఓ ప్రకటన విడుదల చేసింది. ‘అయోధ్యలో రాముడి ప్రాణప్రతిష్ట ఒక చారిత్రక మైలురాయి. కాబట్టి రామమందిర ప్రారంభోత్సవం రోజున..హిందూ మత విశ్వాసాలకు చెందిన ప్రభుత్వ అధికారులకు 2గంటల సెలవును మంజూరు చేసేందుకు ప్రభుత్వం అంగీకరించింది’ అని తెలిపింది. కాగా, ఆఫ్రికాలో హిందూమతాన్ని ఎక్కువగా ఆచరించే ఏకైక దేశం మారిషస్. 2011లో దాదాపు 48.5 శాతం హిందువులు ఆ దేశంలో ఉన్నారు. భారత్, నేపాల్ తర్వాత అత్యధికంగా హిందువులున్న దేశం మారిషసే కావడం గమనార్హం.

Tags:    

Similar News