CAR: రాకెట్ కంటే వేగంగా అమ్ముడుపోతున్న ఈ కారు గురించి తెలుసా?
రాకెట్ కంటే వేగంగా అమ్ముడుపోతున్న ఈ కారు గురించి తెలుసా
దిశ, వెబ్ డెస్క్ : జీవితంలో సెటిల్ అయినా వాళ్ళు ఇల్లు లేదా కారు కొనుగోలు చేయాలనుకుంటారు. కొందరు స్పాట్ లో తీసుకుంటారు మరి కొందరు ఈఎమ్ఐ లో తీసుకుంటారు. అయితే, కార్ల తయారీ సంస్థలు జూలై నెలలో అమ్మకాలను రిలీజ్ చేశాయి.
ఈ ఏడాది మొదట్లో ప్యాసింజర్ వాహనాలలో SUV లు భారీగా అమ్ముడుపోయినట్టు తెలుస్తుంది. ఈ నెలలో సియామ్ (SIAM) విడుదల చేసిన జాబితాలో మొత్తం 13.6 లక్షల కార్లు అమ్ముడుపోయాయి. దీనిలో SUV లు, MPV అమ్మకాలు 8,68,132 యూనిట్లు ఎక్కువగా ఉన్నాయి. మొత్తం అమ్మకాలను గతేదితో పోలిస్తే 2 శాతం సేల్స్ పెరిగాయి. వీటిలో ఎస్యూవీలు, ఎంపీవీల విక్రయాలు 63 శాతంగా ఉన్నాయి.
టాటా పంచ్ కారు అగ్రస్థానంలో ఉంది. గత నాలుగు నెలల్లో మొత్తం 72,466 కార్లు అమ్ముడుపోయాయి. గతేడాది ఇవి 45,067 కార్లు మాత్రమే అమ్ముడయ్యాయి. వీటిలో మిడ్ సైజ్ కార్ల కంటే కాంపాక్ట్ SUV లే ఎక్కువగా అమ్ముడవుతున్నాయి. ఈ కార్లనే కొనాలనే కోరిక ప్రజల్లో ఎక్కువగా ఉంది. అదే సమయంలో బడ్జెట్ తక్కువగా ఉంటే ఎక్కువ కొనడానికి మొగ్గు చూపుతారు.