అమ్మా.. నన్ను క్షమించు.. ఈ పిచ్చి పని చేస్తున్న

దిశ, వెబ్‌డెస్క్ : పసి హృదయంపై నిందలు మోపారు. ఇప్పుడిప్పుడే లోకం పోకడలను చూస్తున్న బాలికను అపరాదభావం కలిగేలా మాటలతో మానసిక హింసకు గురి చేశారు. అభం శుభం తెలియని ఆ బాలిక మనసు ఆ మాటలకు ముక్కలై.. ఉరి కొయ్యకు ఉయ్యాల ఊగింది. 14 ఏళ్ల బాలికపై కొందరు నిందలు మోపడంతో ఆమె ఆత్మహత్య చేసుకున్న ఘటన వికారాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. స్థానికుల సమాచారం ప్రకారం.. పెద్దేముల్ మండలం మంబాపూర్ గ్రామానికి చెందిన రేణుక […]

Update: 2021-02-08 03:42 GMT

దిశ, వెబ్‌డెస్క్ : పసి హృదయంపై నిందలు మోపారు. ఇప్పుడిప్పుడే లోకం పోకడలను చూస్తున్న బాలికను అపరాదభావం కలిగేలా మాటలతో మానసిక హింసకు గురి చేశారు. అభం శుభం తెలియని ఆ బాలిక మనసు ఆ మాటలకు ముక్కలై.. ఉరి కొయ్యకు ఉయ్యాల ఊగింది. 14 ఏళ్ల బాలికపై కొందరు నిందలు మోపడంతో ఆమె ఆత్మహత్య చేసుకున్న ఘటన వికారాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. స్థానికుల సమాచారం ప్రకారం..

పెద్దేముల్ మండలం మంబాపూర్ గ్రామానికి చెందిన రేణుక స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. ఆమెపై గ్రామానికి చెందిన కొందరు లేనిపోని మాటలతో నిందలు మోపారు. స్కూల్‌కు వెళ్లిన బాలికకు తోటి విద్యార్థుల నుంచి కూడా అవే కామెంట్స్ వినిపించడంతో మనస్తాపం చెందింది.

‘అమ్మా.. నన్ను క్షమించు. నిందలు భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్న. తన చావు పట్ల ఎవరు ఏ విధంగా అనుకోవద్దు. అమ్మమ్మ నన్ను క్షమించు. ఈ పిచ్చి పని చేస్తున్న అని ఏమీ అనుకోవద్దు’ అని సూసైడ్ నోట్ రాసి ఇంట్లోనే ఉరి వేసుకోని ఆత్మహత్య చేసుకుంది. ఆకతాయిల మాటలకు బాలిక బలి కావడంతో ఆ కుటుంబం కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. రేణుక ఆత్మహత్య చేసుకోవడం.. ఆమె చివరిసారి రాసిన లేఖ గ్రామస్తులను సైతం కదిలించింది.

Tags:    

Similar News