పోలీసుల్లో 95 శాతం మందికి యాంటీబాడీలు వృద్ధి
శ్రీనగర్: జమ్ము కశ్మీర్ లోయలో సాధారణ ప్రజలతో పోల్చి్తే అక్కడి పోలీసు సిబ్బంది అత్యధికంగా యాంటీ బాడీలను కలిగి ఉన్నట్టు ఓ సర్వేలో వెల్లడైంది. జమ్ము కశ్మీర్‌లోని 10 జిల్లాల్లోని పోలీసు సిబ్బంది, ఇతర ఉద్యోగుల, ప్రజలపై శ్రీనగర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీ బృందం సర్వే నిర్వహించింది. ఈ సర్వే ప్రకారం లోయలోని పోలీసుల్లో 95 శాతం మంది కరోనాకు వ్యతిరేకంగా యాంటీ బాడీలను కలిగి ఉన్నట్టు తెలిసింది. ఆ తర్వాత 91 శాతం సీరో ప్రీవలెన్స్‌తో […]
శ్రీనగర్: జమ్ము కశ్మీర్ లోయలో సాధారణ ప్రజలతో పోల్చి్తే అక్కడి పోలీసు సిబ్బంది అత్యధికంగా యాంటీ బాడీలను కలిగి ఉన్నట్టు ఓ సర్వేలో వెల్లడైంది. జమ్ము కశ్మీర్‌లోని 10 జిల్లాల్లోని పోలీసు సిబ్బంది, ఇతర ఉద్యోగుల, ప్రజలపై శ్రీనగర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీ బృందం సర్వే నిర్వహించింది. ఈ సర్వే ప్రకారం లోయలోని పోలీసుల్లో 95 శాతం మంది కరోనాకు వ్యతిరేకంగా యాంటీ బాడీలను కలిగి ఉన్నట్టు తెలిసింది. ఆ తర్వాత 91 శాతం సీరో ప్రీవలెన్స్‌తో హెల్త్‌కేర్ సిబ్బంది ఉన్నట్టు సర్వే తెలిపింది. కాగా పోలీసుల్లో 100 శాతం వ్యాక్సినేషన్ పూర్తయిందని, పోలీసుల్లో అత్యధిక శాతం యాంటీబాడీలు అభివృద్ధి చెందడానికి టీకాలకు మధ్య ప్రత్యక్ష సంబంధం ఉందని వైద్యులు చెబుతున్నారు.
కశ్మీర్ లోయలో 85 శాతం సీరో ప్రీవలెన్స్ ఉన్నట్టు సర్వేలో తేలింది. ఇది జాతీయ సగటు 67 శాతం కన్నా చాలా అధికమని సర్వే చెప్పింది. 7 నుంచి 18 ఏండ్లలోపు పిల్లల్లో 78 శాతం పిల్లలు కొవిడ్ బారిన పడ్డారని వారిలో ఇప్పటికే యాంటీబాడీలు అభివృద్ధి చెందినట్టు తెలిపింది. 45 ఏండ్లకు పైబడిన వారిలో 89 శాతం మందిలో, 18 ఏండ్లకు పైబడిన వారిలో 84 శాతం మందిలో, 7 నుంచి 18 ఏండ్లలోపు పిల్లల్లో 78 శాతం మందిలో యాంటీబాడీలు అభివృద్ధి చెందాయి.
‘ ప్రజలను వయస్సుల వారీగా విభజించి ఈ సర్వే నిర్వహించాము. వ్యాక్సినేషన్ పొందని 7నుంచి 18 ఏండ్ల పిల్లలపై సర్వే నిర్వహించగా 78 శాతం మందిలో యాంటీబాడీలు అభివృద్ధి చెందినట్టు గుర్తించాము. ప్రభుత్వం పాఠశాలలు ప్రారంభించాలని నిర్ణయం తీసుకోవాలని భావిస్తే దానికి ఇది ఒక మంచి సూచికగా పనిచేస్తుంది’ అని గవర్నమెంట్ మెడికల్ కాలేజీ కమ్యూనిటీ మెడిసిన్ డిపార్ట్‌మెంట్ హెడ్ సలీమ్ ఖాన్ వెల్లడించారు.