"83" విజువల్ ట్రీట్… థియేటర్స్ లోనే రిలీజ్

1983… భారతదేశం ప్రపంచం ముందు గర్వంగా తలెత్తుకుని నిలబడేలా చేసింది. ప్రపంచ క్రికెట్ చరిత్రలో సువర్ణక్షరాలతో భారత్ పేరును లిఖించేలా చేసింది. తొలిసారి క్రికెట్ వరల్డ్ కప్ ను గెలుచుకుని అభిమానులకు ఎనలేని సంబరాన్ని అందించిన ఘట్టం అదే ఏడాదిలో ఆవిష్కృతం అయింది. దీంతో 83 పేరుతో బాలీవుడ్ లో సినిమాను తెరకెక్కించారు దర్శకుడు కబీర్ ఖాన్. కపిల్ దేవ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో రణ్ వీర్ సింగ్ కపిల్ దేవ్ గా […]

Update: 2020-04-28 08:36 GMT

1983… భారతదేశం ప్రపంచం ముందు గర్వంగా తలెత్తుకుని నిలబడేలా చేసింది. ప్రపంచ క్రికెట్ చరిత్రలో సువర్ణక్షరాలతో భారత్ పేరును లిఖించేలా చేసింది. తొలిసారి క్రికెట్ వరల్డ్ కప్ ను గెలుచుకుని అభిమానులకు ఎనలేని సంబరాన్ని అందించిన ఘట్టం అదే ఏడాదిలో ఆవిష్కృతం అయింది. దీంతో 83 పేరుతో బాలీవుడ్ లో సినిమాను తెరకెక్కించారు దర్శకుడు కబీర్ ఖాన్. కపిల్ దేవ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో రణ్ వీర్ సింగ్ కపిల్ దేవ్ గా నటిస్తున్నాడు.

కాగా కరోనా కారణంగా 83 సినిమా విడుదల వాయిదా పడింది. దీంతో సినిమాను నేరుగా ఓటీటి లో విడుదల చేస్తారని టాక్ వచ్చింది. డిజిటల్ మీడియా ప్లాట్ ఫామ్ నుంచి భారీ ఆఫర్ వచ్చినా సరే… నిర్మాతలు అందుకు ఒప్పుకోలేద ట. కాగా ఈ విషయంపై క్లారిటీ ఇచ్చాడు డైరెక్టర్ కబీర్ ఖాన్. విజువల్ ట్రీట్ గా తెరకెక్కిన ఈ సినిమాను పెద్ద తెరపై చూస్తేనే బాగుంటుందని తెలిపాడు. ఎంతో కష్టపడి సినిమా చేశామని… ప్రేక్షకులు సినిమా హాల్ లో చూసి ఆనందించాలని కోరాడు. సాధారణ పరిస్థితులు నెలకొనగానే సినిమా రిలీజ్ చేస్తామని స్పష్టం చేశాడు.

Tags : 83, Ranveer Singh, Deepika Padukone, Kabir Khan, OTT

Tags:    

Similar News