80 ఏళ్ల వృద్ధుడు.. యుద్ధవీరుల కోసం మోపెడ్‌పై 230 కిమీ. ప్రయాణం

దిశ, ఫీచర్స్ : 1971 ఇండో-పాక్ యుద్ధంలో తనతో పాటు పాల్గొన్న సహచరులకు నివాళులు అర్పించేందుకు 80 ఏళ్ల మాజీ సైనికుడు సాహసమే చేశాడు. పంజాబ్‌లోని తన సొంత పట్టణం నుంచి జమ్మూ కశ్మీర్‌లోని అఖ్నూర్ సెక్టార్‌కు తన పాత ‘మోపెడ్’పై 230 కి.మీ ప్రయాణించాడు. హోషియార్‌పూర్ జిల్లా ముకేరియన్ బెల్ట్‌కు చెందిన సెకండ్ జనరేషన్ ఆర్మీ మ్యాన్ సుబేదార్ జై సింగ్.. 1965, 1971 ఇండో-పాక్ యుద్ధాల్లో అఖ్నూర్ సెక్టార్‌లో సహచరులతో కలిసి ధైర్యంగా పోరాడాడు. […]

Update: 2021-12-09 11:08 GMT

దిశ, ఫీచర్స్ : 1971 ఇండో-పాక్ యుద్ధంలో తనతో పాటు పాల్గొన్న సహచరులకు నివాళులు అర్పించేందుకు 80 ఏళ్ల మాజీ సైనికుడు సాహసమే చేశాడు. పంజాబ్‌లోని తన సొంత పట్టణం నుంచి జమ్మూ కశ్మీర్‌లోని అఖ్నూర్ సెక్టార్‌కు తన పాత ‘మోపెడ్’పై 230 కి.మీ ప్రయాణించాడు. హోషియార్‌పూర్ జిల్లా ముకేరియన్ బెల్ట్‌కు చెందిన సెకండ్ జనరేషన్ ఆర్మీ మ్యాన్ సుబేదార్ జై సింగ్.. 1965, 1971 ఇండో-పాక్ యుద్ధాల్లో అఖ్నూర్ సెక్టార్‌లో సహచరులతో కలిసి ధైర్యంగా పోరాడాడు.

కాగా భారత సైన్యం అత్యున్నత సంప్రదాయంలో భాగంగా.. అఖ్నూర్-జౌరియన్ సరిహద్దులోని ఛంబ్‌లో 1971 యుద్ధంలో పరాక్రమంతో పోరాడిన తన సహచరులకు నివాళులు అర్పించాలని మాజీ సోల్జర్ జై సింగ్ నిర్ణయించుకున్నట్లు ఆర్మీ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ‘ఈ సుబేదార్ 1971లో అఖ్నూర్‌లోని చప్రియాల్ ప్రాంతంలో జరిగిన యుద్ధంలో 216 ఫీల్డ్ రెజిమెంట్‌తో కలిసి పోరాడాడు. CO(కమిషన్డ్ ఆఫీసర్), లెఫ్టినెంట్ కల్నల్ ML సేథీతో సహా ఇద్దరు అధికారులు, ఇద్దరు జూనియర్ కమీషన్డ్ ఆఫీసర్లు (JCOలు), రెజిమెంట్‌లోని 64 మంది ఇతర ర్యాంకర్స్ ఆపరేషన్‌లో భాగంగా అత్యున్నత త్యాగం చేశారు’ అని లెఫ్టినెంట్ కల్నల్ ఆనంద్ చెప్పారు.

అయితే ‘స్వర్ణిమ్ విజయ్ దివస్’ పురస్కరించుకుని సింగ్.. తన నివాసం నుంచి 1971లో యుద్ధం జరిగిన తుపాకీ ప్రాంతం, పహారీవాలాలోని 216 ఫీల్డ్ రెజిమెంట్ మెమోరియల్‌కు తన పాత ‘మోపెడ్’పై 230 కి.మీ ప్రయాణించాడు. ఈ సందర్భంగా తన CO, OCతో పాటు అసువులు బాసిన సైనిక సోదరులను గర్వంతో, చెమర్చిన కళ్లతో జ్ఞాపకం చేసుకున్నాడని కల్నల్ ఆనంద్ తెలిపారు. అతని దేశభక్తి భావం.. ఆ కార్యక్రమానికి హాజరైన వారందరికీ ప్రేరణగా నిలిచిందని వెల్లడించారు.

Tags:    

Similar News