నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. కేంద్ర ప్రభుత్వ శాఖల్లో 8.72 లక్షల ఖాళీలు

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో గతేడాది మార్చి 1 నాటికి 8.72 లక్షల ఉద్యోగాలు ఖాళీలున్నట్టు కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ వెల్లడించారు. గతేడాది మార్చి 1 నాటికి కేంద్ర ప్రభుత్వ శాఖల్లో మొత్తం సాంక్షన్ అయిన ఉద్యోగాలు 40,04,941. ఇందులో 31,32,698 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారని కేంద్ర మంత్రి రాజ్యసభకు గురువారం తెలియజేశారు. అంటే మొత్తం 8,72,243 ఖాళీలున్నాయని వివరించారు. కేంద్ర ప్రభుత్వోద్యోగాలను రిక్రూట్ చేసే మూడు ప్రధాన ఏజెన్సీల వివరాలు తెలియజేశారు. 2016-17 […]

Update: 2021-07-29 05:46 GMT

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో గతేడాది మార్చి 1 నాటికి 8.72 లక్షల ఉద్యోగాలు ఖాళీలున్నట్టు కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ వెల్లడించారు. గతేడాది మార్చి 1 నాటికి కేంద్ర ప్రభుత్వ శాఖల్లో మొత్తం సాంక్షన్ అయిన ఉద్యోగాలు 40,04,941. ఇందులో 31,32,698 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారని కేంద్ర మంత్రి రాజ్యసభకు గురువారం తెలియజేశారు. అంటే మొత్తం 8,72,243 ఖాళీలున్నాయని వివరించారు. కేంద్ర ప్రభుత్వోద్యోగాలను రిక్రూట్ చేసే మూడు ప్రధాన ఏజెన్సీల వివరాలు తెలియజేశారు. 2016-17 నుంచి 2020-21 వరకు యూపీఎస్సీ 25,267 మంది అభ్యర్థులను, ఎస్ఎస్‌సీ 2,14,601 మంది అభ్యర్థులను, రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు 2,04,945 మంది అభ్యర్థులను రిక్రూట్ చేసుకున్నట్టు వివరించారు.

Tags:    

Similar News