గ్రేటర్ ఎన్నికల్లో 77 కేసులు నమోదు

దిశ, క్రైమ్ బ్యూరో : గ్రేటర్ ఎన్నికల తేదీ దగ్గరపడుతున్న కొద్దీ, రాజకీయ పార్టీల ప్రచారంలో అత్యంత ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రోజురోజుకీ మాటల వాడీ, వేడీ పెరుగుతోంది. మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ క్రమంలో వివిధ వర్గాల ప్రజలను ప్రేరేపించేలా పలువురు నాయకులు అనుచిత వ్యాఖ్యలను కూడా చేస్తున్నారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో పాటు పలువురి మనోభావాలు దెబ్బ తినే పరిస్థితులు నెలకొన్నాయి. ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు సజావుగా జరిగేందుకు… అనుచిత వ్యాఖ్యలు […]

Update: 2020-11-28 11:56 GMT

దిశ, క్రైమ్ బ్యూరో : గ్రేటర్ ఎన్నికల తేదీ దగ్గరపడుతున్న కొద్దీ, రాజకీయ పార్టీల ప్రచారంలో అత్యంత ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రోజురోజుకీ మాటల వాడీ, వేడీ పెరుగుతోంది. మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ క్రమంలో వివిధ వర్గాల ప్రజలను ప్రేరేపించేలా పలువురు నాయకులు అనుచిత వ్యాఖ్యలను కూడా చేస్తున్నారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో పాటు పలువురి మనోభావాలు దెబ్బ తినే పరిస్థితులు నెలకొన్నాయి. ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు సజావుగా జరిగేందుకు… అనుచిత వ్యాఖ్యలు చేసే వారి పట్ల నిబంధనల ప్రకారం కఠిన చర్యలకు ఎన్నికల కమిషన్ ఆదేశించింది. దీంతో ఎన్నికల ప్రచారంలో భాగంగా పలువురు రాజకీయ నాయకులపై కేసులు నమోదవుతున్నాయి.

ఈ క్రమంలో ఈ నెల 24న ఎర్రగడ్డ లోని సుల్తాన్ నగర్ లో ఎంఐఎం నేత, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలు, ఈ నెల 25న బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్ సమీపంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ప్రసంగాలపై ఎస్ఆర్ నగర్ పోలీసులు కేసులు నమోదు చేశారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన దగ్గర నుంచి (10 రోజుల్లో) ఇప్పటి వరకూ సుమారు 77 కేసులు నమోదైనట్టు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. వీటిలో 68 కేసులు ఎఫ్ఐఆర్ కాగా, మిగతా కేసులు పెటీ కేసులు. ఇదిలా ఉండగా, శనివారం ఒక్కరోజే పోలీసులకు, ఎన్నికల కమిషన్‌కు 15 ఫిర్యాదులు అందాయి. వీటిలో 14 ఫిర్యాదులపై కేసులు బుక్ చేయగా, 1 ఫిర్యాదును పెటీ కేసుగా నమోదు చేశారు.

అందులో బీజేపీ- 4 ఫిర్యాదులు చేయగా, టీడీపీ -1, ఎంఐఎం -1 ఫిర్యాదులను చేశాయి. వాటిలో లిక్కర్‌‌ను తరలించే ఫిర్యాదులే అత్యధికంగా వచ్చినట్టుగా తెలుస్తోంది. సుమారు రూ.4.32 లక్షల నగదును శనివారం సీజ్ చేయగా, రూ.1.78 వేల విలువ చేసే లిక్కర్‌ను స్వాధీనం చేసుకున్నారు. గ్రేటర్ ఎన్నికలను పురస్కరించుకుని ఇప్పటి వరకూ రూ.1.46 కోట్ల నగదును సీజ్ చేశారు. వీటిలో స్టాటిక్ సర్వేలైన్స్ బృందాల ద్వారా రూ.10.31 లక్షలు కాగా, మిగతా రూ.రూ.1.01 కోట్లను ఇతర ఏజెన్సీల ద్వారా పట్టుకున్నారు. అంతే కాకుండా, రూ.13.66 లక్షల విలువ చేసే లిక్కర్, మత్తు పదార్థాలను పోలీసులు పట్టుకున్నారు.

ఆదివారంతో సాయంత్రంతో ప్రచారం ముగియనుంది. డిసెంబరు 1 మంగళవారం ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు వారి ప్రచారానికి ఆదివారం రాత్రి, సోమవారం రోజునే లిక్కర్, నగదును అత్యధికంగా తరలించే అవకాశం లేకపోలేదు. ఈ పరిస్థితుల్లో కీలకమైన ఈ రెండ్రోజుల్లో మరింత నగదును, మద్యాన్ని పట్టుకునేందుకు మరింత దృష్టి పెట్టనున్నారు.

Tags:    

Similar News