ఫ్యాషన్ కొనుగోళ్లకే 72 శాతం మంది ఆసక్తి!
దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత ఏడాదిలో ఎక్కువ మంది వినియోగదారులు ఫ్యాషన్ విభాగం కొనుగోళ్లపై గతం కంటే ఎక్కువగా ఖర్చు చేస్తున్నారని ఓ నివేదిక తెలిపింది. ప్రముఖ బై నౌ-పే లేటర్ ప్లాట్‌ఫామ్ జస్ట్‌మనీ దేశవ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో 72 శాతం మంది ఫ్యాషన్ ఉత్పత్తులనే ఎక్కువగా కొన్నట్టు స్పష్టం చేశారు. ఇది ఆర్థికవ్యవస్థలో వ్యయం, ఈ పరిశ్రమ డిమాండ్ పునరుజ్జీవనాన్ని సూచిస్తుందని జస్ట్‌మనీ నివేదిక అభిప్రాయపడింది. ఫ్యాషన్ పరిశ్రమలో కస్టమర్ల షాపింగ్ ప్రాధాన్యతలపై వివరాలు నివేదిక సేకరించగా […]
దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత ఏడాదిలో ఎక్కువ మంది వినియోగదారులు ఫ్యాషన్ విభాగం కొనుగోళ్లపై గతం కంటే ఎక్కువగా ఖర్చు చేస్తున్నారని ఓ నివేదిక తెలిపింది. ప్రముఖ బై నౌ-పే లేటర్ ప్లాట్‌ఫామ్ జస్ట్‌మనీ దేశవ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో 72 శాతం మంది ఫ్యాషన్ ఉత్పత్తులనే ఎక్కువగా కొన్నట్టు స్పష్టం చేశారు. ఇది ఆర్థికవ్యవస్థలో వ్యయం, ఈ పరిశ్రమ డిమాండ్ పునరుజ్జీవనాన్ని సూచిస్తుందని జస్ట్‌మనీ నివేదిక అభిప్రాయపడింది. ఫ్యాషన్ పరిశ్రమలో కస్టమర్ల షాపింగ్ ప్రాధాన్యతలపై వివరాలు నివేదిక సేకరించగా 18-30 ఏళ్ల వినియోగదారులు ఆన్‌లైన్ ద్వారా ఫ్యాషన్ ఉత్పత్తులపై 71 శాతం మంది ఆసక్తి చూపిస్తున్నారు.
ఇదే సమయంలో పురుషుల కంటే మహిళలు ఈ లావాదేవీలపై 20 శాతం ఎక్కువ ఖర్చు చేస్తున్నారు. 58 శాతం మంది గత మూడు నెలల్లో తమ ఫ్యాషన్ అవసరాల కోసం రూ. 5,000 కంటే ఎక్కువ ఖర్చు చేశామని చెప్పారు. 54 శాతం మంది ఈ కొనుగోళ్లకు ‘బై నౌ-పే లేటర్’ సౌకర్యాన్ని ఎంచుకుంటున్నామని, ఆ తర్వాత డెబిట్, క్రెడిట్, నగదు చెల్లింపుల ద్వారా చేస్తున్నారని తేలింది. భారత్‌లో ఫ్యాషన్, లైఫ్‌స్టైల్ విభాగాలు అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. ముఖ్యంగా వినియోగదారులు చెల్లింపుల్లో ఇబ్బందుల్లేని విధానాన్ని ఎక్కువగా ఎంచుకుంటున్నారని’ జస్ట్‌మనీ వ్యవస్థాపకుడు లిజీ చాప్‌మన్ అన్నారు. ఇక, కొనుగోళ్లు చేస్తున్న వారిలో బెంగళూరు, హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, పూణె నగరాల నుంచి ఎక్కువ మంది ఉన్నారు. టైర్2,టైర్3 నగరాలో అనంతపురం, అసోం, హరిద్వార్, కాంచిపురం నగరాలు వేగంగా వృద్ధి చెందుతున్నాయి.