లాక్‌డౌన్ ప్రకటన.. 700 కి.మీల ట్రాఫిక్ జామ్

న్యూఢిల్లీ: ఫ్రాన్స్‌‌లో మరోసారి లాక్‌డౌన్ విధించే ప్రటకన వెలువడగానే పట్టణాల్లోని ప్రజలు పల్లెలకు పోటెత్తారు. దేశంలో కరోనా కేసులు మళ్లీ విజృంభించడంతో మరోసారి లాక్‌డౌన్ విధించే నిర్ణయాన్ని అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మాక్రన్ తీసుకున్నారు. శుక్రవారం నుంచి సరిగ్గా నాలుగు వారాల పాటు(డిసెంబర్ 1 వరకు) దేశంలో లాక్‌డౌన్ అమలవుతుందని గురువారం ఆదేశించారు. దీంతో దేశరాజధాని ప్యారిస్ నుంచి ప్రజలు గ్రామీణ ప్రాంతాలకు తరలివెళ్లడానికి పెద్దమొత్తంలో రోడ్లపైకి వచ్చారు. దీంతో ఒక్కసారిగా రవాణా స్తంభించింది. సుమారు 700 కిలోమీటర్ల […]

Update: 2020-10-31 07:00 GMT

న్యూఢిల్లీ: ఫ్రాన్స్‌‌లో మరోసారి లాక్‌డౌన్ విధించే ప్రటకన వెలువడగానే పట్టణాల్లోని ప్రజలు పల్లెలకు పోటెత్తారు. దేశంలో కరోనా కేసులు మళ్లీ విజృంభించడంతో మరోసారి లాక్‌డౌన్ విధించే నిర్ణయాన్ని అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మాక్రన్ తీసుకున్నారు. శుక్రవారం నుంచి సరిగ్గా నాలుగు వారాల పాటు(డిసెంబర్ 1 వరకు) దేశంలో లాక్‌డౌన్ అమలవుతుందని గురువారం ఆదేశించారు. దీంతో దేశరాజధాని ప్యారిస్ నుంచి ప్రజలు గ్రామీణ ప్రాంతాలకు తరలివెళ్లడానికి పెద్దమొత్తంలో రోడ్లపైకి వచ్చారు. దీంతో ఒక్కసారిగా రవాణా స్తంభించింది. సుమారు 700 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. అలాగే, ఎప్పుడూ రద్దీగా కనిపించే ప్యారిస్ నగర వీధులు శుక్ర, శనివారాల్లో వెలవలబోయాయి. ప్రభుత్వం కఠిన నిబంధనలతో తాజా లాక్‌డౌన్ విధించింది.

Tags:    

Similar News