కరోనా రోగులొచ్చారని.. తాళమేసుకుని గ్రామస్థుల పరార్

దిశ, జుక్కల్: కామారెడ్డి జిల్లాలో కరోనా రోగుల రాక పై తోటి గ్రామస్థులే అభ్యంతరం వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఎవరి ఇళ్లకు వారు తాళాలు వేసుకుని వెళ్లిపోయారు. ఈ ఘటన జిల్లాలోని జిల్లా బిచ్కుంద, పెద్ద కొడపగల్ మండలాల పరిధిలో ఆదివారం వెలుగు చూసింది.వివరాల్లోకివెళితే..పై రెండు మండలాల్లో ఏడుగురు వ్యక్తులను కరోనా పాజిటివ్ వచ్చింది.దీంతో వారిని చికిత్స నిమిత్తం బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అనంతరం మళ్లీ వారిని తిరిగి హోం క్వారంటైన్‌కు తరలించారు. అయితే, 14రోజుల […]

Update: 2020-07-05 07:22 GMT

దిశ, జుక్కల్: కామారెడ్డి జిల్లాలో కరోనా రోగుల రాక పై తోటి గ్రామస్థులే అభ్యంతరం వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఎవరి ఇళ్లకు వారు తాళాలు వేసుకుని వెళ్లిపోయారు. ఈ ఘటన జిల్లాలోని జిల్లా బిచ్కుంద, పెద్ద కొడపగల్ మండలాల పరిధిలో ఆదివారం వెలుగు చూసింది.వివరాల్లోకివెళితే..పై రెండు మండలాల్లో ఏడుగురు వ్యక్తులను కరోనా పాజిటివ్ వచ్చింది.దీంతో వారిని చికిత్స నిమిత్తం బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అనంతరం మళ్లీ వారిని తిరిగి హోం క్వారంటైన్‌కు తరలించారు.

అయితే, 14రోజుల పాటు ఆస్పత్రిలో క్వారంటైన్ ఉంచకుండా ఎందుకు ఇంటికి తీసుకొచ్చారని స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా వచ్చిన వారిలో బిచ్కుంద మండల కేంద్రానికి చెందిన ముగ్గురు. పెద్ద కొడప్గల్ మండలంలోని లచ్చిరాం తండాకు చెందిన ముగ్గురు వ్యక్తులున్నారు. బిచ్కుంద మండల కేంద్రంలోని ఓ చెప్పుల దుకాణంలో గుమాస్తాగా పనిచేస్తున్న రాజుల గ్రామానికి చెందిన వ్యక్తిని వైద్యులు ఇంటికి తరలించడంతో ఆయా గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. దీనిపై వైద్యశాఖ అధికారులను వివరణ కోరగా కరోనా బాధితులే ఇంటికి వెళతామంటే పంపించామని సమాధానమిస్తున్నారు. కానీ, గ్రామస్థులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వం ప్రతి డివిజన్ కేంద్రానికి కరోనా కట్టడి కోసం ఐసో లేషన్ వార్డులను ఏర్పాటు చేసింది. వీరందరినీ కూడా అక్కడికే పంపి చికిత్స అందిస్తే బాగుంటుందని మండల ప్రజలు కూడా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా, బిచ్కుంద మండలానికి చెందిన ముగ్గురు పాజిటివ్ వ్యక్తులను హోం క్వారంటైన్‌కు తరలించడంతో చుట్టుపక్కల నివాసముండే ప్రజలు తమ ఇళ్లకు తాళాలు వేసి వెళ్లిపోతున్నారు. దీనిపై సంబంధిత అధికారులు, నాయకులు స్పందించి బాధితులను ఐసోలేషన్ వార్డులకు తరలించి చికిత్స అందించాలని స్థానికులు కోరుతున్నారు.

Tags:    

Similar News