రాష్ట్రం లో ఒకే రోజు ఏడుగురికి కరోనా పాజిటివ్

దిశ, న్యూస్ బ్యూరో తెలంగాణలో మరో ఏడు క రోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరంతా ప్రస్తుతం గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతు న్నారు. ఒకే రోజున ఏడుగురు కరోనా పాజిటివ్ లక్షణాలతో ఉన్నట్లు వైద్య పరీక్షల ద్వారా నిర్ధారణ కావడం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆందోళనకు గురిచేసింది. ఇండోనేషియా నుంచి వచ్చిన పదిమందిలో ఒకరు రెండు రోజుల క్రితమే పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. ఇప్పుడు అదే ఇండోనేషియా బృందానికి చెందిన మరో […]

Update: 2020-03-18 12:52 GMT

దిశ, న్యూస్ బ్యూరో

తెలంగాణలో మరో ఏడు క రోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరంతా ప్రస్తుతం గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతు న్నారు. ఒకే రోజున ఏడుగురు కరోనా పాజిటివ్ లక్షణాలతో ఉన్నట్లు వైద్య పరీక్షల ద్వారా నిర్ధారణ కావడం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆందోళనకు గురిచేసింది. ఇండోనేషియా నుంచి వచ్చిన పదిమందిలో ఒకరు రెండు రోజుల క్రితమే పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. ఇప్పుడు అదే ఇండోనేషియా బృందానికి చెందిన మరో ఏడుగురికి కూడా పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. దీంతో తెలంగాణలో ఇప్పటివరకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 14 కు చేరుకుంది. మొత్తం మీద ఒకరికి చికిత్స అనంతరం నెగిటివ్ గా తేలడంతో ఇంటికి వెళ్లిపోయారు. మిగిలిన 13 మంది గాంధీ ఆసుపత్రిలో వార్డులో చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ లో వివిధ శాఖల ఉన్నతాధికారులతో బుధ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

Tags: 7 corona positive cases in telangana, Coronavirus, Gandhi Hospital, health department telangana

Tags:    

Similar News