బ్లడ్ క్యాన్సర్‌తో పోరాడుతున్న పసివాడు.. సాయం కోసం ఎదురుచూపులు
దిశ, వెబ్‌డెస్క్ : నల్గొండ జిల్లా కొండ మల్లేపల్లి గ్రామానికి చెందిన కృుతిక్ (6) అనే బాలుడు బ్లడ్ క్యాన్సర్‌తో కొన్నాళ్లుగా ప్రాణాలతో పోరాడుతున్నాడు. ప్రస్తుతం బాలుడికి పంజాగుట్టలోని లిటిల్ స్టార్ చిల్డ్రన్ హస్పిటల్‌లో తల్లిదండ్రులు చికిత్స అందిస్తున్నారు. కుృతిక్ పేరెంట్స్ రంజిత్ మరియు లావణ్య గ్రామాల్లో తిరుగుతూ ఇంట్లో వినియోగించే సామగ్రిని అమ్ముకుంటూ జీవనం పొందుతున్నారు. బాలుడి చికిత్స కోసం రూ. 11లక్షలు అవసరమని వైద్యులు చెప్పారు. అసలే కరోనాతో ఏర్పడ్డ పరిస్థితుల వలన ఆదాయం […]
దిశ, వెబ్‌డెస్క్ : నల్గొండ జిల్లా కొండ మల్లేపల్లి గ్రామానికి చెందిన కృుతిక్ (6) అనే బాలుడు బ్లడ్ క్యాన్సర్‌తో కొన్నాళ్లుగా ప్రాణాలతో పోరాడుతున్నాడు. ప్రస్తుతం బాలుడికి పంజాగుట్టలోని లిటిల్ స్టార్ చిల్డ్రన్ హస్పిటల్‌లో తల్లిదండ్రులు చికిత్స అందిస్తున్నారు. కుృతిక్ పేరెంట్స్ రంజిత్ మరియు లావణ్య గ్రామాల్లో తిరుగుతూ ఇంట్లో వినియోగించే సామగ్రిని అమ్ముకుంటూ జీవనం పొందుతున్నారు.
బాలుడి చికిత్స కోసం రూ. 11లక్షలు అవసరమని వైద్యులు చెప్పారు. అసలే కరోనాతో ఏర్పడ్డ పరిస్థితుల వలన ఆదాయం లేకపోగా.. ఇప్పుడు అంత డబ్బు ఎక్కడి నుంచి తేగలమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాబును ఎలా బతికించుకోవాలో తెలియక వారు బాధపడుతున్నారు. దాతలు ఎవరైనా సహాయం చేసి బాబును బతికించగలరని బాలుడి తల్లిదండ్రులు కోరుతున్నారు. ఫిజికల్ డైరెక్టర్ నందు ఆధ్వరంలో బాబు చికిత్స కోసం విరాళాలు సేకరిస్తున్నారు. దాతలు ఎవరైనా ముందుకొచ్చి ఫొన్ నెం : 96761 24682 నెంబర్‌కు ఫోన్ పే కానీ, గూగుల్ పే కానీ చేయగలరని వారు కోరుతున్నారు.