ఆరేళ్లకే గేమ్‌ రూపొందించిన ‘అర్హం’

దిశ, వెబ్‌డెస్క్: గుజరాత్‌, అహ్మదాబాద్‌కు చెందిన ఓ చిన్నోడు ప్రపంచంలోనే అతి చిన్న వయసు గల కంప్యూటర్ ప్రోగ్రామర్‌గా గిన్నిస్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించాడు. ఈ విషయాన్ని మైక్రోసాఫ్ట్ వెల్లడించింది. రెండో తరగతి చదువుతున్న అర్హం ఓం తల్సానియా ఆరేళ్ల వయసులో ఈ ఘనత సాధించడం విశేషం. కాగా తల్లిదండ్రులు తమ చిన్నారులను ప్రోత్సహిస్తే ఎంతటి విజయాన్నయినా సాధించగలరని ఈ గుజరాతీ పిల్లోడు నిరూపించాడు. అర్హం ఓం తల్సానియా రెండేళ్ల వయసు నుంచే స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్లెట్‌లను […]

Update: 2020-11-11 03:55 GMT

దిశ, వెబ్‌డెస్క్: గుజరాత్‌, అహ్మదాబాద్‌కు చెందిన ఓ చిన్నోడు ప్రపంచంలోనే అతి చిన్న వయసు గల కంప్యూటర్ ప్రోగ్రామర్‌గా గిన్నిస్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించాడు. ఈ విషయాన్ని మైక్రోసాఫ్ట్ వెల్లడించింది. రెండో తరగతి చదువుతున్న అర్హం ఓం తల్సానియా ఆరేళ్ల వయసులో ఈ ఘనత సాధించడం విశేషం. కాగా తల్లిదండ్రులు తమ చిన్నారులను ప్రోత్సహిస్తే ఎంతటి విజయాన్నయినా సాధించగలరని ఈ గుజరాతీ పిల్లోడు నిరూపించాడు.

అర్హం ఓం తల్సానియా రెండేళ్ల వయసు నుంచే స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్లెట్‌లను ఆపరేట్ చేసేవాడు. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అయిన అర్హం తండ్రి తల్సానియా.. కొడుకు ఆసక్తిని గమనించి చిన్నప్పటి నుంచే తనను ప్రోత్సహిస్తూ వచ్చాడు. కంప్యూటర్ పజిల్స్‌ను సింపుల్‌గా సాల్వ్ చేయడంతో పాటు వీడియో గేమ్స్ ఆడటంలోనూ అర్హం ఎక్సపర్ట్‌గా మారిపోయాడు. తరచుగా గేమ్స్ ఆడుతుండే అర్హంకు ఈ క్రమంలోనే ఓ గేమ్ రూపొందించాలనే ఆలోచన వచ్చిందట. ఆ విషయాన్ని తండ్రికి వివరించడంతో.. మొదట తనకు బేసిక్ పైథాన్ ప్రోగ్రామింగ్‌ను నేర్పించాడు. ప్రోగ్రామింగ్‌పై పట్టు సాధించిన తర్వాత చిన్న చిన్న గేమ్స్ రూపొందించడం స్టార్ట్ చేసిన అర్హం.. ఇటీవలే మైక్రోసాఫ్ట్ సర్టిఫికేషన్ ఎగ్జామ్‌ను క్లియర్ చేయడంతో ప్రపంచంలోనే అతి పిన్న వయస్కుడైన కంప్యూటర్ ప్రోగ్రామర్‌గా నిలిచాడు. ఇక అర్హం రూపొందించిన గేమ్ ప్రొగ్రామ్‌ను గిన్నిస్ నిర్వాహకులకు పంపించగా, అది అర్హం రూపొందించిందేనని నిర్దారించుకున్న గిన్నిస్ కమిటీ.. తనను అత్యంత చిన్న వయసు ప్రోగ్రామర్‌గా గుర్తించింది.

‘నాన్న నాకు కోడింగ్ నేర్పించాడు. నేను 2 సంవత్సరాల వయసులోనే టాబ్లెట్లను ఉపయోగించేవాడిని. మూడేళ్లకు విండోస్, ఐవోఎస్ గాడ్జెట్లను ఉపయోగించాను. నాన్న ఫైథాన్ ప్రోగ్రామింగ్‌పై పనిచేస్తుండటంతో నాకు బేసిక్స్ నేర్పించారు. ఇది నాకు బాగా ఉపయోగపడింది’ అని తల్సానియా చెప్పాడు. అర్హం భవిష్యత్తులో బిజినెస్‌మెన్‌గా స్థిరపడాలనుకుంటున్నాడు.

Tags:    

Similar News