ప్రయాణికులు లేక ఆరు రైళ్లు రద్దు
దిశ, తెలంగాణ బ్యూరో: కరోనా విజృంభణ, లాక్‌డౌన్ కారణంగా రైళ్లలో ప్రయాణికులు తగ్గిపోయారు. దీంతో ప్రయాణికుల నుంచి డిమాండ్ లేకపోవడంతో మరో ఆరు ప్రత్యేక రైళ్లను దక్షిణ మధ్య రైల్వే తాజాగా రద్దు చేసింది. కాచిగూడ-విశాఖపట్నం, లింగపల్లి-విశాఖపట్నం రూట్లలో రైళ్లు రద్దు చేసినట్లు అధికారులు ఇవాళ ప్రకటించారు. విశాఖపట్నం-కాచిగూడ, విశాఖపట్నం-లింగపల్లి రైళ్లను ఈనెల 11 నుంచి 20 వరకు, కాచిగూడ-విశాఖపట్నం, లింగపల్లి-విశాఖపట్నం రైళ్లను ఈనెల 12 నుంచి 21 వరకు క్యాన్సిల్ చేసినట్లు వెల్లడించారు.