షాకింగ్.. కర్నూలు వైద్యుడి కుటుంబంలో ఆరుగురికి పాజిటివ్

కర్నూలు జిల్లాలో నేడు ఐదు కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదైనట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించిన సంగతి తెలిసిందే. గురువారం ఉదయం నుంచి నేటి ఉదయం వరకు నమోదైన 13 కరోనా కేసుల్లో ఆరు కేసులు ఇటీవల కరోనా కారణంగా మృతి చెందిన వైద్యుడి కుటుంబ సభ్యులవే కావడం విశేషం. అంతే కాకుండా కర్నూలు సర్వజన ఆస్పత్రిలో పనిచేస్తున్న వైద్యురాలికి కూడా కరోనా వైరస్ సోకినట్టు అధికారులు వెల్లడించారు. దీంతో ఆ జిల్లాలో ఆందోళన నెలకొంది. […]

Update: 2020-04-18 01:06 GMT

కర్నూలు జిల్లాలో నేడు ఐదు కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదైనట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించిన సంగతి తెలిసిందే. గురువారం ఉదయం నుంచి నేటి ఉదయం వరకు నమోదైన 13 కరోనా కేసుల్లో ఆరు కేసులు ఇటీవల కరోనా కారణంగా మృతి చెందిన వైద్యుడి కుటుంబ సభ్యులవే కావడం విశేషం.

అంతే కాకుండా కర్నూలు సర్వజన ఆస్పత్రిలో పనిచేస్తున్న వైద్యురాలికి కూడా కరోనా వైరస్ సోకినట్టు అధికారులు వెల్లడించారు. దీంతో ఆ జిల్లాలో ఆందోళన నెలకొంది. కర్నూలు జిల్లాలో ఇప్పటి వరకు రాష్ట్రంలోనే అత్యధికంగా 129 కేసులు నమదయ్యాయి. ఇందులో ఒకరు మాత్రమే కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కాగా, ఇద్దరు మృతి చెందారు. ఇంకా ఆసుపత్రుల్లో 126 మంది చికిత్స పొందుతున్నారు.

కేంద్ర ప్రభుత్వంతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా వెల్లడించిన జోన్లలో కర్నూలు ఆది నుంచి రెడ్ జోన్‌లోనే ఉంది. దీంతో ఆ జిల్లాలో కరోనా కట్టడికి పలు చర్యలు తీసుకుంటున్నా ఫలితం ఉండడం లేదు. ఈ నేపథ్యంలో అక్కడ మరిన్ని కఠినమైన ఆంక్షలు విధించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఏపీలో ఇప్పటి వరకు నమోదైన కేసుల్లో 44 శాతం గుంటూరు, కర్నూలు జిల్లాలకు సంబంధించినవే కావడం విశేషం.

Tags: kurnool district, corona virus, doctor family report positive, covid-19

Tags:    

Similar News