విద్యుత్ వైర్లు తగిలి బస్సు దగ్ధం.. ఆరుగురు మృతి
దిశ, వెబ్‌డెస్క్ : ప్రయాణిస్తున్న బస్సుకు విద్యుత్ వైర్లు తగలడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లో మంటలు వ్యాప్తి చెందటంతో ప్రయాణికులు తప్పించుకోవడానికి వీలు లేకుండా పోయింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా, మరో 17 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన రాజస్థాన్‌లోని జాలోర్ జిల్లా మహేశ్ పూర్‌లో శనివారం అర్థరాత్రి చోటుచేసుకుంది. కాగా, క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలికి చేరకుని […]
దిశ, వెబ్‌డెస్క్ : ప్రయాణిస్తున్న బస్సుకు విద్యుత్ వైర్లు తగలడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లో మంటలు వ్యాప్తి చెందటంతో ప్రయాణికులు తప్పించుకోవడానికి వీలు లేకుండా పోయింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా, మరో 17 మందికి తీవ్ర గాయాలయ్యాయి.
ఈ ఘటన రాజస్థాన్‌లోని జాలోర్ జిల్లా మహేశ్ పూర్‌లో శనివారం అర్థరాత్రి చోటుచేసుకుంది. కాగా, క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలికి చేరకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.లేనియెడల ప్రాణనష్టం అధికంగా ఉండేదని తెలుస్తోంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు.