ఢిల్లీ మెట్రో స్టేషన్‌లో ‘గోలీ మారో..’

న్యూఢిల్లీ : ఢిల్లీలోని రాజీవ్ చౌక్ మెట్రో స్టేషన్‌లో కొందరు.. వివాదాస్పద నినాదాలు చేశారు. మెట్రో ట్రెయిన్ రాగానే.. దేశ్ కే గద్దారోంకో.. గోలీ మారో సాలోంకో(దేశద్రోహులను తుపాకీతో కాల్చి చంపండి) అని ఆరుగురు గుమిగూడి నినాదాలిచ్చారు. మెట్రో నుంచి ప్రయాణికులు దిగిన తర్వాత కూడా దీంతోపాటు సీఏఏను సమర్థిస్తున్న స్లోగన్స్ ఇచ్చారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు.. ఆరుగురు ఈ నినాదాలిచ్చిన గుర్తించారని చెప్పారు. అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా వీరిని అదుపులోకి తీసుకున్నట్టు వివరించారు. ఢిల్లీ ఎన్నికల […]

Update: 2020-02-29 05:44 GMT

న్యూఢిల్లీ : ఢిల్లీలోని రాజీవ్ చౌక్ మెట్రో స్టేషన్‌లో కొందరు.. వివాదాస్పద నినాదాలు చేశారు. మెట్రో ట్రెయిన్ రాగానే.. దేశ్ కే గద్దారోంకో.. గోలీ మారో సాలోంకో(దేశద్రోహులను తుపాకీతో కాల్చి చంపండి) అని ఆరుగురు గుమిగూడి నినాదాలిచ్చారు. మెట్రో నుంచి ప్రయాణికులు దిగిన తర్వాత కూడా దీంతోపాటు సీఏఏను సమర్థిస్తున్న స్లోగన్స్ ఇచ్చారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు.. ఆరుగురు ఈ నినాదాలిచ్చిన గుర్తించారని చెప్పారు. అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా వీరిని అదుపులోకి తీసుకున్నట్టు వివరించారు.

ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ వివాదాస్పదమైన ఈ స్లోగన్స్ చేసిన విషయం తెలిసిందే. అనంతరం ఈ నినాదాన్ని సీఏఏ నిరసనకారులకు వ్యతిరేకంగా తరుచూ ఉపయోగిస్తున్నారు.

Tags:    

Similar News