చప్పుడు కాలేదు.. అయినా ఆరుగురు అరెస్ట్
దిశ హుజూర్ నగర్: వీళ్లంతా కొంత డిఫరెంట్ గా ఆలోచించారు. ఇళ్లునే స్థావరంగా మార్చుకున్నారు. ఎవరికీ దొరకమనుకుని దర్జాగా తమ కార్యక్రమం ప్రారంభించారు. అంతలోనే తలుపుచప్పుడు అయ్యింది. దీంతో వీరంతా ఒకరికొకరు ముఖాలు చూసుకున్నారు. అందరి గొంతులో నీళ్లు తడుముకున్నాయి. అందులో ఒకరు పోయి తలుపు తెరిచాడు. అంతే.. ఇగా సినిమా అర్థమైపోయింది. ఈ ఆరుగురు కూడా వచ్చినవారితో వెళ్లిపోయారు. మొత్తానికి విషయం ఎవరికీ తెలియదనుకున్నారు కానీ, రచ్చరచ్చ అయ్యింది. హుజూర్ నగర్ నియోజకవర్గ పరిధిలో ఉండే […]
దిశ హుజూర్ నగర్: వీళ్లంతా కొంత డిఫరెంట్ గా ఆలోచించారు. ఇళ్లునే స్థావరంగా మార్చుకున్నారు. ఎవరికీ దొరకమనుకుని దర్జాగా తమ కార్యక్రమం ప్రారంభించారు. అంతలోనే తలుపుచప్పుడు అయ్యింది. దీంతో వీరంతా ఒకరికొకరు ముఖాలు చూసుకున్నారు. అందరి గొంతులో నీళ్లు తడుముకున్నాయి. అందులో ఒకరు పోయి తలుపు తెరిచాడు. అంతే.. ఇగా సినిమా అర్థమైపోయింది. ఈ ఆరుగురు కూడా వచ్చినవారితో వెళ్లిపోయారు. మొత్తానికి విషయం ఎవరికీ తెలియదనుకున్నారు కానీ, రచ్చరచ్చ అయ్యింది.
హుజూర్ నగర్ నియోజకవర్గ పరిధిలో ఉండే మేళ్లచెరువులోని ఓ ఇంట్లో మంగళవారం పోలీసులు దాడులు నిర్వహించారు. ఆ ఇంట్లో పేకాట ఆడుతున్న ఆరుగురిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 6 సెల్ ఫోన్లు, ఒక బైక్, రూ. 38,360 నగదు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. అనంతరం వారిపై కేసు నమోదు చేశారు.