తక్కువ కాలవ్యవధిలో గృహ రుణాలకు పెరిగిన డిమాండ్
దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల పరిణామాల్లో గృహ రుణాల వడ్డీ రేట్లు అతి తక్కువగా ఉండటంతో ఇళ్ల కొనుగోలుదారుల్లో 51 శాతం మంది 15 ఏళ్ల కాలవ్యవధికి రుణాలను తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారని మ్యాజిక్‌బ్రిక్స్ నివేదిక వెల్లడించింది. నివేదిక వివరాల ప్రకారం.. ఇళ్లను కొనాలనుకునేవారిలో 26 శాతం మంది 10 ఏళ్ల కాలవ్యవధికి ప్రాధాన్యత ఇస్తున్నారు. దీని తర్వాత 10-15 ఏళ్ల వ్యవధి కోసం 25 శాతం మంది, 15-20 ఏళ్ల కాలవ్యవధికి 23 శాతం మంది ప్రాధాన్యత […]
దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల పరిణామాల్లో గృహ రుణాల వడ్డీ రేట్లు అతి తక్కువగా ఉండటంతో ఇళ్ల కొనుగోలుదారుల్లో 51 శాతం మంది 15 ఏళ్ల కాలవ్యవధికి రుణాలను తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారని మ్యాజిక్‌బ్రిక్స్ నివేదిక వెల్లడించింది. నివేదిక వివరాల ప్రకారం.. ఇళ్లను కొనాలనుకునేవారిలో 26 శాతం మంది 10 ఏళ్ల కాలవ్యవధికి ప్రాధాన్యత ఇస్తున్నారు. దీని తర్వాత 10-15 ఏళ్ల వ్యవధి కోసం 25 శాతం మంది, 15-20 ఏళ్ల కాలవ్యవధికి 23 శాతం మంది ప్రాధాన్యత ఇస్తున్నారని తేలింది. 16 శాతం 25 ఏళ్లకు పైగా కాలవ్యవధితో రుణాలను తీసుకోవాలనుకుంటున్నారని, కేవలం 10 శాతం మంది మాత్రమే 20-25 ఏళ్ల వ్యవధికి రుణాలు కావాలనుకుంటున్నట్టు నివేదిక తెలిపింది.
హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, పూణె లాంటి కీలక నగరాల్లోని వినియోగదారుల నుంచి గృహ రుణాలకు డిమాండ్ అధికంగా ఉందని మ్యాజిక్‌బ్రిక్స్ పేర్కొంది. ‘వర్క్ ఫ్రమ్ హోమ్, సర్కిల్ రేట్ల తగ్గింపు, స్టాంప్ డ్యూటీ, తక్కువ వడ్డీ రేట్ల కారణంగానే ఇళ్లను కొనాల్సిన అవసరం లేకపోయినప్పటికీ ఇతర పెట్టుబడి మార్గాల కోసం ఇళ్లను కొనేవారు పెరిగారని’ మ్యాజిక్‌బ్రిక్స్ సీఈఓ సుధీర్ చెప్పారు. ప్రస్తుతం సగటున గృహ రుణాల వడ్డీ రేట్లు 6.65 శాతం నుంచి 6.90 శాతం మధ్య ఉన్నాయని నివేదిక వివరించింది.