ఆర్టీసీలో డేంజర్ బెల్స్.. 50 మంది మృత్యువాత
దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ ఆర్టీసీలో కరోనా వేగంగా వ్యాప్తి చెందుతోంది. నిత్యం వేల మందితో ప్రయాణం కావడంతో ప్రధానంగా కండక్టర్లకు, డ్రైవర్లకు పాజిటివ్వస్తోంది. రాష్ట్రంలోని ప్రతీ డిపో పరిధిలో సగటున 10 నుంచి 20 మంది వరకు పాజిటివ్‌తో ఉన్నారు. ఇప్పటి వరకు 50 మంది ఆర్టీసీ కార్మికులు కరోనాకు బలయ్యారు. ఇటీవల మంచిర్యాల జిల్లాలోనే రెండు రోజుల్లో నలుగురు మృతి చెందారు. గ్రేటర్‌లోని 17 డిపోలతో పాటుగా రాష్ట్ర సరిహద్దు డిపోల్లో కరోనా […]
దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ ఆర్టీసీలో కరోనా వేగంగా వ్యాప్తి చెందుతోంది. నిత్యం వేల మందితో ప్రయాణం కావడంతో ప్రధానంగా కండక్టర్లకు, డ్రైవర్లకు పాజిటివ్వస్తోంది. రాష్ట్రంలోని ప్రతీ డిపో పరిధిలో సగటున 10 నుంచి 20 మంది వరకు పాజిటివ్‌తో ఉన్నారు. ఇప్పటి వరకు 50 మంది ఆర్టీసీ కార్మికులు కరోనాకు బలయ్యారు. ఇటీవల మంచిర్యాల జిల్లాలోనే రెండు రోజుల్లో నలుగురు మృతి చెందారు. గ్రేటర్‌లోని 17 డిపోలతో పాటుగా రాష్ట్ర సరిహద్దు డిపోల్లో కరోనా భయం వెంటాడుతోంది.
ఏం చేస్తున్నారు..?
ఆర్టీసీలో కరోనా భయంతో కార్మికులు చచ్చిపోతున్నా ప్రభుత్వం, యాజమాన్యం నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తోందనే ఆరోపణలున్నాయి. కరోనా భయంతో డ్రైవర్లు, కండక్టర్లు సెలవు పత్రాలు పట్టుకుని అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. ప్రస్తుతం విధులు నిర్వర్తించలేమంటూ విన్నవించుకుంటున్నారు. మరోవైపు ఆర్టీసీ బస్సుల్లో ఎలాంటి నిబంధనలు పాటించడం లేదు. మొదట్లో బస్సులను శానిటైజ్చేశారు. ప్రయాణీకులకు కూడా శానిటైజర్ అందుబాటులో పెట్టగా.. మాస్క్ ఉంటేనే బస్సులోకి అనుమతించేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. మాస్కులున్నా లేకున్నా బస్సుల్లో వెళ్తున్నారు. గతంలో సీటు గ్యాప్ నిబంధనలు ఉండగా దాన్ని ఎత్తివేశారు. సెకండ్ వేవ్ చాలా ప్రమాదకరంగా మారింది. నైట్ కర్ఫ్యూ నేపథ్యంలో బస్సులను తగ్గించడం, సమయాన్ని కుదించడంతో రద్దీ పెరిగింది. రద్దీకి అనుగుణంగా బస్సులను నడుపడం లేదు. ఫలితంగా ఆర్టీసీ కార్మికులు కరోనాకు బలవుతున్నారు.
ఇక కరోనా మొదటివేవ్‌లో 32 మంది కార్మికులు మృతి చెందగా.. సెకండ్‌వేవ్‌లో ఇప్పటికే 50 మంది చనిపోయినట్లు లెక్కలు చెప్పుతున్నాయి. అంతేకాకుండా ఇప్పటికిప్పుడు 1800 మంది కరోనా పాజిటివ్‌తో వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని, కొంతమంది పరిస్థితి దయనీయంగా ఉందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆస్పత్రుల్లో వైద్యానికి కూడా డబ్బులు లేక అవస్థలు పడుతున్నారంటున్నారు.
మరోవైపు పాజిటివ్ వచ్చిన డ్రైవర్లు, కార్మికులకు సరైన చికిత్స కూడా అందడం లేదు. ఆర్టీసీ ఆస్పత్రిలో బెడ్‌లు ఉన్నా చేర్చుకోవడం లేదంటూ ఆరోపిస్తున్నారు. ఆర్టీసీ కార్మికులకు రక్షణ పరికరాలు ఇవ్వడం లేదని, ముందు జాగ్రత్త చర్యలు లేవంటూ తెలంగాణ ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో ఈ నెల 3న రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి ప్రభుత్వానికి, యాజమాన్యానికి నివేదించారు. కానీ ఇప్పటికీ నిర్లక్ష్యమే ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ నెల 11న నిరసనలు..
కరోనా నుంచి ఆర్టీసీ కార్మికులను రక్షించాలని, పాజిటివ్ వచ్చిన వారికి సరైన వైద్య చికిత్సలు అందించాలంటూ తెలంగాణ ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో ఈ నెల 11న నిరసన చేపట్టుతున్నట్లు ఈయూ ప్రధాన కార్యదర్శి కె. రాజిరెడ్డి తెలిపారు. అన్ని డిపోలు, యూనిట్ల దగ్గర యూనియన్లకు అతీతంగా నల్ల బ్యాడ్జీలు ధరించాలని, నల్ల బ్యాడ్జీలతోనే విధుల్లోకి వెళ్లాలని ఆయన కోరారు. ఇప్పటికైనా ప్రభుత్వం పట్టించుకోవాలని విజ్ఞప్తి చేశారు.