వరంగల్ స్మార్ట్ సిటీకి రూ. 50 కోట్లు విడుదల

దిశ, వరంగల్ సిటీ: వరంగల్ నగరంలో స్మార్ట్ సిటీకి సంబంధించి రూ. 50 కోట్లు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. 2217 పద్దులో భాగంగా స్మార్ట్ సిటీ పనులకు రూ. 87.64 కోట్లను ప్రతిపాదించగా.. రూ.37.64 కోట్లను గతంలో మంజూరు చేసింది. ఈ నేపథ్యంలోనే 2020-21 సంవత్సరానికి ఈ ఉత్తర్వుల ద్వారా 50 కోట్లు రూపాయలు ప్రభుత్వం తాజాగా మంజూరు చేసింది. అయితే, వరంగల్ స్మార్ట్ సిటీకి సంబంధించి స్మార్ట్ సిటీల […]

Update: 2020-07-10 08:37 GMT

దిశ, వరంగల్ సిటీ: వరంగల్ నగరంలో స్మార్ట్ సిటీకి సంబంధించి రూ. 50 కోట్లు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. 2217 పద్దులో భాగంగా స్మార్ట్ సిటీ పనులకు రూ. 87.64 కోట్లను ప్రతిపాదించగా.. రూ.37.64 కోట్లను గతంలో మంజూరు చేసింది. ఈ నేపథ్యంలోనే 2020-21 సంవత్సరానికి ఈ ఉత్తర్వుల ద్వారా 50 కోట్లు రూపాయలు ప్రభుత్వం తాజాగా మంజూరు చేసింది. అయితే, వరంగల్ స్మార్ట్ సిటీకి సంబంధించి స్మార్ట్ సిటీల కింద ఖర్చులను తీర్చడం కోసం.. టీయూఎఫ్ఐడీసీ అకౌంట్‌కు ప్రభుత్వం ద్వారా పరిపాలనా అనుమతులు జారీ చేసింది.

Tags:    

Similar News