ఈ-కామర్స్ ద్వారా సర్వీస్ అందించే ఆటో రిక్షా సేవలకు 5 శాతం జీఎస్టీ!

దిశ, వెబ్‌డెస్క్: ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా సర్వీస్ అందించే ఆటో-రిక్షా సేవలపై వచ్చే ఏడాది నుంచి 5 శాతం జీఎస్టీ విధించబడనుంది. ఈ మేరకు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని రెవెన్యూ విభాగం నవంబర్ 18 నాటి నోటిఫికేషన్‌లో పేర్కొన్నట్టు ఈ-కామర్స్ ద్వారా రవాణా సేవలందించే ఆటో రిక్షాలకు జీఎస్టీ మినహాయింపును ఉపసంహరించుకుంది. సాధారణ ఆటో రిక్షా సేవలను ఎలాంటి జీఎస్టీ ఉండదని, ఏదైనా ఈ-కామర్స్ ద్వారా అందించే వారికి మాత్రమే 2022, జనవరి 1 నుంచి […]

Update: 2021-11-26 09:02 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా సర్వీస్ అందించే ఆటో-రిక్షా సేవలపై వచ్చే ఏడాది నుంచి 5 శాతం జీఎస్టీ విధించబడనుంది. ఈ మేరకు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని రెవెన్యూ విభాగం నవంబర్ 18 నాటి నోటిఫికేషన్‌లో పేర్కొన్నట్టు ఈ-కామర్స్ ద్వారా రవాణా సేవలందించే ఆటో రిక్షాలకు జీఎస్టీ మినహాయింపును ఉపసంహరించుకుంది. సాధారణ ఆటో రిక్షా సేవలను ఎలాంటి జీఎస్టీ ఉండదని, ఏదైనా ఈ-కామర్స్ ద్వారా అందించే వారికి మాత్రమే 2022, జనవరి 1 నుంచి 5 శాతం పన్ను అమలు కానుంది.

ఈ-కామర్స్ పరిశ్రమ ప్రస్తుతం మార్కెట్లో కీలకంగా ఉంది. చాలావరకు కంపెనీలు ప్రయాణీకులకు చేరువ అయ్యేందుకు ఆన్‌లైన్ ద్వారా తక్కువ, అనుకూలమైన బుకింగ్ రైడ్‌లను ఇవ్వడం వల్ల పరిశ్రమలో ప్రభావం కనిపిస్తోంది. తాజాగా సవరించిన మార్పు వల్ల మెరుగైన పరిస్థితులు ఏర్పడనున్నాయి.

Tags:    

Similar News