అక్కపై అత్యాచారం, చెల్లెలికి లైంగిక వేధింపులు

దిశ, హైదరాబాద్ : హైదరాబాద్‌లోని పాతబస్తీలోని కమాటి పురాలో అమానుష ఘటన చోటుచేసుకుంది. ప్రేమపేరుతో ప్రలోభపెట్టిన ఓ యువకుడు 9తరగతి చదువుతున్న బాలికను అత్యాచారం చేశాడు.ఈ విషయాన్ని తన ముగ్గురు మిత్రులకు చెప్పగా వారు ఆమెను బ్లాక్ మెయిల్ చేశారు. పాఠశాలలో, బస్తీలో చెబుతానంటూ బెదిరించి గత కొంతకాలంగా ఆ బాలికపై అత్యాచారం చేస్తూ వచ్చారు. మరో ఘటనలో 7వ తరగతి చదువుతున్న ఆ బాలిక చెల్లెలిని ఓ యువకుడు లైంగికంగా వేధిస్తున్నాడు. ఈ విషయం ఆలస్యంగా […]

Update: 2020-03-18 20:29 GMT

దిశ, హైదరాబాద్ :
హైదరాబాద్‌లోని పాతబస్తీలోని కమాటి పురాలో అమానుష ఘటన చోటుచేసుకుంది. ప్రేమపేరుతో ప్రలోభపెట్టిన ఓ యువకుడు 9తరగతి చదువుతున్న బాలికను అత్యాచారం చేశాడు.ఈ విషయాన్ని తన ముగ్గురు మిత్రులకు చెప్పగా వారు ఆమెను బ్లాక్ మెయిల్ చేశారు. పాఠశాలలో, బస్తీలో చెబుతానంటూ బెదిరించి గత కొంతకాలంగా ఆ బాలికపై అత్యాచారం చేస్తూ వచ్చారు. మరో ఘటనలో 7వ తరగతి చదువుతున్న ఆ బాలిక చెల్లెలిని ఓ యువకుడు లైంగికంగా వేధిస్తున్నాడు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో పోలీసులు 5యువకులను అదుపులోకి తీసుకున్నారు. వారిపై అత్యాచారం, పొస్కో చట్టం కింద కేసులు నమోదు చేశారు.ఈ 5గురిలో ముగ్గురు మైనర్లు కాగా వారిని జువైనల్ హోంకు పంపిస్తారని తెలుస్తోంది. దీనిపై స్పందించిన బాలల హక్కుల సంఘం గౌరవ అధ్యక్షుడు అచ్యుత రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రోజులో ఏదో మూల అమ్మాయిలపై అత్యాచారాలు జరుగుతున్నాయన్నారు.వీటిని అడ్డుకోవడంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందన్నారు.

Tags: two sisters, one raped, one facing sexual harrrasement, old city, kamatipura, 5arrested, 3 minors

Tags:    

Similar News