ధరణి పోర్టల్‌ను ఎంతమంది వీక్షించారంటే !
దిశ, తెలంగాణ బ్యూరో: ‘ధరణి’ పోర్టల్‌ను 5.84లక్షల మంది వీక్షించినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎలాంటి అంతరాయం లేకుండా పని చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 2,622 రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయని, వాటి ద్వారా రూ.7.77కోట్ల ఆదాయం సమకూరిందన్నారు. అలాగే ఇప్పటి వరకు 5,971స్లాట్లు బుక్ అయ్యాయి. 6,239 మంది స్టాంపు డ్యూటీ చెల్లించినట్లు వివరించారు. బీఆర్కే భవన్‌లో వంద మందితో ఏర్పాటు చేసిన ధరణి కంట్రోల్ రూంను సీఎస్ […]
దిశ, తెలంగాణ బ్యూరో: ‘ధరణి’ పోర్టల్‌ను 5.84లక్షల మంది వీక్షించినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎలాంటి అంతరాయం లేకుండా పని చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 2,622 రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయని, వాటి ద్వారా రూ.7.77కోట్ల ఆదాయం సమకూరిందన్నారు. అలాగే ఇప్పటి వరకు 5,971స్లాట్లు బుక్ అయ్యాయి. 6,239 మంది స్టాంపు డ్యూటీ చెల్లించినట్లు వివరించారు. బీఆర్కే భవన్‌లో వంద మందితో ఏర్పాటు చేసిన ధరణి కంట్రోల్ రూంను సీఎస్ సందర్శించి, అక్కడ పని చేస్తోన్న సాంకేతిక సిబ్బందితో మాట్లాడారు. ఆయన వెంట స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ కూడా ఉన్నారు.