4 నెలల చిన్నారి కిడ్నాప్.. 14గంటల్లోనే..
దిశ, క్రైమ్‌బ్యూరో: హైదరాబాద్‌లో అపహరణకు గురైన 4నెలల చిన్నారి కేసును పోలీసులు 14గంటల్లోనే ఛేదించి.. తల్లి ఒడికి చేర్చారు. మంగళ్‌హాట్ ఇన్‌స్పెక్టర్ రణవీర్‌రెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సీతారాంబాగ్ కట్టెలమండి ప్రాంతంలో నివసించే రేణుకకు 4నెలల పాప ఉంది. శనివారం ఉదయం తెల్లవారుజామున 3గంటల సమయంలో తల్లి పక్కన నిద్రిస్తున్న చిన్నారిని దుండగులు అపహరించుకుపోయారు. మెలకువ వచ్చిన తర్వాత తల్లి చూసుకునే సరికి చిన్నారి లేకపోవడంతో వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే కేసు దర్యాప్తు […]
దిశ, క్రైమ్‌బ్యూరో: హైదరాబాద్‌లో అపహరణకు గురైన 4నెలల చిన్నారి కేసును పోలీసులు 14గంటల్లోనే ఛేదించి.. తల్లి ఒడికి చేర్చారు. మంగళ్‌హాట్ ఇన్‌స్పెక్టర్ రణవీర్‌రెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సీతారాంబాగ్ కట్టెలమండి ప్రాంతంలో నివసించే రేణుకకు 4నెలల పాప ఉంది. శనివారం ఉదయం తెల్లవారుజామున 3గంటల సమయంలో తల్లి పక్కన నిద్రిస్తున్న చిన్నారిని దుండగులు అపహరించుకుపోయారు. మెలకువ వచ్చిన తర్వాత తల్లి చూసుకునే సరికి చిన్నారి లేకపోవడంతో వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే కేసు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు సీసీ ఫుటేజీని పరిశీలించి బోయిన్‌గూడ కమాన్‌కు చెందిన షేక్ అలీమ్, ఆర్షియా, షేక్ సలీమ్‌ను అదుపులోకి తీసుకుని విచారించడంతో నిజం ఒప్పుకున్నారు. చిన్నారిని పోలీసులకు అప్పగించారు. భిక్షాటన కోసం కిడ్నాప్‌నకు పాల్పడినట్లు నిందితులు తెలిపారు.