నగరానికి కొత్తగా 4500మంది కానిస్టేబుళ్లు
దిశ, తెలంగాణ క్రైమ్బ్యూరో: హైదరాబాద్‌కు కొత్తగా 4500మంది కానిస్టేబుళ్లను ప్రభుత్వం కేటాయించింది. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 1645 మంది, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 1461 మంది, రాచకొండ కమిషనరేట్ పరిధిలో 1394 మంది తమ ఉద్యోగ విధులకు రిపోర్ట్ చేశారు. ఈ సందర్భంగా మూడు కమిషనరేట్ల పరిధిలోని కమిషనర్లు అంజనీకుమార్, వీసీ సజ్జనార్, మహేష్ భగవత్ లు కొత్తగా విధుల్లో చేరిన సిబ్బందిని అభినందించారు. అనంతరం వారినుద్దేశించి సీపీ అంజనీకుమార్ మాట్లాడుతూ శాంతిభద్రతల నిర్వహణలో పోలీసు సిబ్బంది […]
దిశ, తెలంగాణ క్రైమ్బ్యూరో: హైదరాబాద్‌కు కొత్తగా 4500మంది కానిస్టేబుళ్లను ప్రభుత్వం కేటాయించింది. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 1645 మంది, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 1461 మంది, రాచకొండ కమిషనరేట్ పరిధిలో 1394 మంది తమ ఉద్యోగ విధులకు రిపోర్ట్ చేశారు. ఈ సందర్భంగా మూడు కమిషనరేట్ల పరిధిలోని కమిషనర్లు అంజనీకుమార్, వీసీ సజ్జనార్, మహేష్ భగవత్ లు కొత్తగా విధుల్లో చేరిన సిబ్బందిని అభినందించారు. అనంతరం వారినుద్దేశించి సీపీ అంజనీకుమార్ మాట్లాడుతూ శాంతిభద్రతల నిర్వహణలో పోలీసు సిబ్బంది ప్రాముఖ్యతను వివరించారు. వృత్తిలో నైపుణ్యంతో పాటు ఉత్సాహాంగా పనిచేయాలని సూచించారు. విధుల్లో భాగంగా ఆధునిక నైపుణ్యాలను నిరంతరం నేర్చుకోవాలన్నారు. మాస్టర్ టెక్నాలజీ, హార్డ్ వర్క్, నిజాయితీతో పౌరులను మీ కుటుంబం లాగా కాపాడుకోవాలన్నారు.